Allu Arjun: స్టైలిష్ స్టార్ అనే బ్రాండ్ నుంచి ఐకాన్ స్టార్ అనే గుర్తింపు వరకు. అస్సలు వీడు హీరో ఏంటి అనే విమర్శ నుంచి హీరో అంటే అల్లు అర్జున్ లా ఉండాలి అనే బ్రాండింగ్ వరకు అల్లు అరవింద్ నట వారసుడి కెరియర్ లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా విజేత, స్వాతిముత్యం, డాడీ సినిమాలలో నటించిన బన్నీ తరువాత గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే రాఘవేంద్రరావు లాంటి అగ్ర దర్శకుడితో చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ మూవీ సక్సెస్ అయ్యింది. అల్లు అర్జున్ నటనకి కూడా మంచి ప్రశంసలు లభించాయి. స్టార్ హీరోగా అవ్వాలని వచ్చినవాడు మొదటి మూవీలోనే లేడీ గెటప్ వేయడం నిజంగా సాహసమే అని చెప్పాలి.
కాని అల్లు అర్జున్ చేసి చూపించాడు. అయితే అతని లుక్ పరంగా చాలా విమర్శలు వచ్చాయి. అయితే రెండో సినిమా ఆర్యతో తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. హీరోగా ఎస్టాబ్లిష్ కావాలంటే తనకంటూ బ్రాండ్ ఉండాలని బన్నీ డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రతి సినిమాకి లుక్స్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా వేరియేషన్స్ చూపిస్తూ స్టైలిష్ స్టార్ అనే బ్రాండ్ సొంతం చేసుకున్నాడు. యూత్ అయితే అల్లు అరుణ్ కాస్ట్యూమ్స్ ని అనుకరిస్తారు. అలాగే అతను సినిమాలలో చెప్పే మేనరిజమ్ డైలాగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి.
ఆర్యలో ఫీల్ మై లవ్ అన్నా, జులాయిలో దేవుడా అనే డైలాగ్ అయిన, మేడమ్ సార్ మేడమ్ అంతే అనే డైలాగ్ అయిన, తగ్గేదిలే అనే ఆటిట్యూడ్ డైలాగ్ అయిన బన్నీ స్టైల్ కారణంగా ఎక్కువగా జనంలోకి వెళ్ళాయి. ఇలా అల్లు అర్జున్ బ్రాండ్ కి ఒక యునిక్ ఐడెంటిటి వచ్చింది. అయితే తన ప్రతి అడుగులో కూడా అల్లు అర్జున్ కష్టం, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఆయా సినిమాలలో కూడా కూడా కనిపిస్తుంది.
అందుకే అల్లు అర్జున్ కెరియర్ ఫ్లాప్ లు చాలా తక్కువ. ఫ్లాప్ అయిన నిర్మాత కమర్షియల్ గా నష్టపోయింది అంటే ఒక్క వరుడు మూవీ మాత్రమే అని చెప్పాలి. కెరియర్ ఆరంభంలో గంగోత్రిలో లేడీ గెటప్ వేసిన అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమాలో కాళికాదేవి గెటప్ లో మెరిసి అందరికి షాక్ ఇచ్చాడు. ఎలాంటి లుక్ లో అయిన కనిపించడానికి తాను వెనుకాడను అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ఈ రోజు దేశంలోనే హైయెస్ట్ బ్రాండ్ వేల్యూ ఉన్న టాలీవుడ్ హీరోగా బన్నీ ఉన్నాడు.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.