Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజుకి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవితో పాటు శ్రీ విష్ణువును పూజించటం వల్ల వారి అనుగ్రహం లభించి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అందువల్ల అక్షయ తృతీయ రోజున మహిళలు బంగారాన్ని కొనటానికి ఇష్టపడతారు.అయితే అక్షయ తృతీయ రోజున బంగారం తో పాటు మరికొన్ని శుభప్రదమైన మరికొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావటం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.అక్షయ తృతీయ రోజున బంగారము తో పాటు ఇంటికి తీసుకురావలసిన ఇతర వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
• తులసి మొక్క :
తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి ఉన్న ఇంట్లో అన్ని రకాల దోషాలు పోయి, లక్ష్మీ, నారాయణుల ఆశీర్వాదం లభిస్తుందని ప్రజల నమ్మకం. అందువల్ల ఈ అక్షయ తృతీయ నాడు తులసి మొక్కను ఇంటికి తీసుకురావటం వల్ల ఇంట్లో ఆనందం, అదృష్టం కొలువై ఉంటుంది.
• శ్రీ యంత్రం :
శ్రీ యంత్రం పరమ పవిత్రమైనది. దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి నియమ నిబంధనలతో పూజించటం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుందని విశ్వాసం.
• శంఖం :
మన హిందూ సంస్కృతిలో శంఖం లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు. ఎందుకంటే శంఖం సముద్ర మథనం సమయంలో ఉద్భవించింది. అందువల్ల అక్షయ తృతీయ రోజున శంఖాన్ని ఇంటికీ తీసుకురావటం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజూ శంఖాన్ని ఊదడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా వెళ్లిపోతుందని, లక్ష్మి దేవి ఎప్పుడూ ఆ ఇంట్లోనే కొలువై ఉంటుందని ప్రజల నమ్ముతారు.
• పసుపు గవ్వలు :
సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి పూజలో సమర్పించే పసుపు గవ్వలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.