Akshaya tritiya: పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ పండగను ఈ ఏడాది శుక్రవారం మే 10, 2024 సంవత్సరంలో జరుపుకుంటారు. అక్షయ తృతీయను పవిత్రమైన శుభ సమయంగా పరిగణిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం ఎంతో మంచిదని భావిస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారు వెండి ఆభరణాలను తమ స్తోమతకు అనుగుణంగా కొనుగోలు చేస్తూ ఉంటారు.
ఇక ఇదే రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తమకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే అక్షయ తృతీయ రోజు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలకు పాత్రులు కావచ్చుని భావిస్తూ ఉంటారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున తులసితో ఈ పరిహారం కనుక చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపైనే ఉంటాయి.
వైశాఖ శుక్ల తృతీయ తిథి మే 10వ తేదీ 2024 ఉదయం 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి మే 11వ తేదీ తెల్లవారుజామున 02:50 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ రోజు తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజించాలి తులసి మొక్కలు సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందని భావిస్తుంటారు ఈ తరుణంలోని అక్షయ తృతీయ రోజు కొత్త తులసి మొక్కను నాటడం ఎంతో శుభప్రదం. అదేరోజు సాయంత్రం నెయ్యితో తులసి మొక్కకు దీపారాధన చేయటం కూడా ఎంతో మంచిది. ఇక విష్ణుమూర్తికి అక్షయ తృతీయ రోజు సమర్పించే నైవేద్యంలో తప్పనిసరిగా తులసి దళాలను వాడటం వల్ల సాక్షాత్తు ఆ విష్ణమూర్తి కరుణ కటాక్షాలు కూడా మన పైనే ఉంటాయి.దీనితో పాటు అక్షయ తృతీయ రోజున తులసి దళంపై స్వస్తిక చిహ్నాన్ని వేసి, పూజలో తులసి ను సమర్పించి ధూపం, దీపం, సువాసన, పువ్వులు మొదలైనవి సమర్పించడం మంచిది
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.