Categories: DevotionalLatestNews

Tirumala Seva: శ్రీవారి భక్తులు అలర్ట్.. తిరుమల సేవకు వయోపరిమితి విధింపు..

Tirumala Seva: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటూ ఉంటారు. అయితే స్వామివారి సేవలో భాగంగా వేలాది సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకొని స్వామివారి సేవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఇకపై స్వామివారి వివిధ సేవలలో పాల్గొనే భక్తులకు టిటిడి వయోపరిమితిని విధించింది. ఇలా టీటీడీకి నిర్ణయించిన  వయసులోపు ఉన్నవారు మాత్రమే స్వామి వారి సేవకులుగా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. మరి స్వామివారి ఏ సేవకు ఎంత వయో పరిమితి అనే విషయానికి వస్తే..

 

శ్రీవారి సేవ: సాక్షాత్తు స్వామివారి సేవకు వెళ్లాలనుకునే సేవకుల వయస్సు తప్పనిసరిగా 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

సూపర్వైజర్ సేవ: 45 నుండి 65 సంవత్సరాలు.

నవనీత సేవ: 35 నుండి 50 సంవత్సరాల వయస్సు వారు అర్హులు.

పరకామణి సేవ: ఈ సేవ కోసం వెళ్లే సేవకుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే 18 నుంచి 65 వయసు వారి వరకు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి18 నుంచి 60 సంవత్సరాలు వారు అర్హులు. ఇక స్వామివారి వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలనుకునే భక్తులు కచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని టీటీడీ చూసించింది.

Age limits for devotees participating in various services at TTD know more details

Tirumala Seva: చిన్నపిల్లలకు అనుమతి లేదు..

స్వామివారి సేవలో భాగంగా వెళ్లే సేవకులకు టీటీడీ మరికొన్ని కీలక సూచనలు చేసింది. శ్రీవారి సేవకు వచ్చే భక్తులు ఎలాంటి పరిస్థితులలో కూడా వారి వెంట చిన్నపిల్లలను తీసుకొని రాకూడదని తెలిపింది. 60 సంవత్సరాలు దాటిన భక్తులను స్వామివారి సేవకు అనుమతించబడదు కానీ వారు వయోవృద్ధుల దర్శనం అలాగే ఇతర ప్రత్యేక దర్శనాలకు అర్హులు. ఇక నిన్నటి రోజున తిరుమల స్వామి వారినీ 66,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 4.51 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.SSD టోకెన్ లేనివారికి స్వామివారి దర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.