Aditi Rao : ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన మహాసముద్రం సినిమాతో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్దిరోజులకే రిలేషన్ గా మారింది. ఇక అప్పటి నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో మార్చి 27న వనపర్తిలోని పురాతన శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి టెంపుల్ లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇదిలావుంటే లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో అదితి సిద్దార్థ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతూ..”సిద్ధార్థ్ నాలో ఎంతో మార్పు తీసుకువచ్చాడు. సిద్ధార్థ్ మాటలు నన్నెంతో ఇన్స్పైర్ చేశాయి. అతడి పరిచయం తర్వాతే ప్రేమపై నమ్మకం పెరిగింది. చాలా విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరిది చైల్డిష్ మెంటాలిటి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ గౌరవం తప్పనిసరిగా ఉంటుంది. మేమిద్దరం ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం. నేను ప్రతి విషయంలో పాజిటివ్ గా ఉంటాను. హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం సహజమే. మా ఇద్దరి గురించి నెట్టింట్లో చాలా గాసిప్స్ వచ్చాయి. వాటికి చెక్ పెట్టాలనే మేము ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాం. మాకు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లందరికీ థ్యాంక్యూ . వాళ్ల అభిమానం ఎంతో విలువైనది.
సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ..‘సెలబ్రిటీలు మీలాగే మనుషులే. వారి పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం తప్పని నా అభిప్రాయం. వారి గోప్యతకు భంగం కలిగించకూడదని అర్థం చేసుకోవాలి. నిజంగా అందరికీ చెప్పే విషయమైతే వారే స్వయంగా చెబుతారు” అని రీసెంట్‌గా ఈ బ్యూటీ ఈ కామెంట్ చేసింది.దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా అదితి ‘హీరామండి’ సిరీస్ నటించింది. ఆమె పోషించిన బిబ్బోజాన క్యారెక్టర్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.