Adipurush: యంగ్ రెబల్ స్ట్రార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కి రెడీ అవుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఏకంగా 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. హిందీలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ని గత ఏడాది రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ని అదిరిపోయే స్పందన వచ్చిన అంతకంటే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. రామాయణం కథని పూర్తిగా మార్చేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. కొంతమంది హిందూ సంఘాల వారు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
పాత్రల చిత్రణ పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ నాశిరకంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపద్యంలో మరల విజువల్ ఎఫెక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ కూడా అంతగా రీచ్ అయ్యేలా లేదు. రాముడు బాహుబలి తరహాలో ఉన్నాడు అంటూ విమర్శించారు. అలాగే బొట్టు లేని సీతమ్మని చూపించారని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ రిలీజ్ కి గట్టిగా చూసుకుంటే 2 నెలల సమయం ఉంది.
ఇక ఈ మూవీ బిజినెస్ కోసం ఇప్పటికే భూషణ్ కుమార్ ఓపెన్ లో పెట్టారు. అయితే ఏ భాషలో కూడా మూవీ థీయాట్రికల్ బిజినెస్ క్లోజ్ కాలేదని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాని కొనడానికి ఎవరు ముందుకి రావడం లేదంట. ప్రేక్షకులకి ఈ సినిమాని రీచ్ చేయడంలో ఆశించిన స్థాయిలో ఇంకా చిత్రా యూనిట్ సక్సెస్ కాలేదు. అయితే మూవీపైన వెయ్యి కోట్ల కలెక్షన్స్ వరకు నిర్మాత ఆశిస్తున్నారు. కాని ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఎవరు కూడా హక్కుల కోసం ముందుకి రాలేదు. కనీసం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా అమ్ముడుపోలేదు. దీంతో ఆదిపురుష్ నిర్మాత ఒకింత టెన్షన్ తో ఉన్నాడు అనే మాట వ్వినిపిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.