Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. దసరా పండుగ స్పెషల్ గా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ సెప్టెంబర్ 20న విడుదల అయ్యింది. స్టువర్టుపురం ప్రాంతంలో 1970లో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోగ్రఫీ తో వచ్చిన ఈ మూవీకి అంతటా పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ మూవీలో దాదాపు 18 తర్వాత ఓ కీలక పాత్రలో కనిపించింది రేణు దేశాయ్ . గుర్రం జాషువా కూతురు సోషలిస్ట్ హేమలత లవణంగా కనిపించింది రేణు దేశాయ్. అయితే సినిమా హిట్ టాక్ రావడంతో తాజాగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రేణు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కాంట్రవర్సీగా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో మీరు పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారా..? అని అడిగిన ప్రశ్నకు రేణు ఇలా సమాధానం చెప్పారు. ” పవన్ గురించి ఈ క్వశ్చన్ అస్సలు వద్దు . ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజానికి అవసరం అని మాత్రమే నేను గతంలో ఒక వీడియో ద్వారా చెప్పాను. అది నా పర్సనల్ ఒపీనియన్. ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది నేను ఎప్పటికీ కోరుకోను. దేవుడే చూసుకుంటాడు. కనీసం ఒక నార్మల్ పర్సన్‌గా కూడా కూడా నేను పవన్‌కు సపోర్ట్‌గా స్టాండ్ తీసుకోను. అంతే కాదు నేను ఎన్నికల్లో ఎవరినీ సపోర్ట్ చేస్తూ ప్రచారం కూడా చేయను. అది నాకు సంబంధించిన విషయం కాదు. ఇప్పటి వరకు నేను పవన్ కల్యాణ్ గురించి నిజాలే చెప్పాను. నా డివోర్స్ సమయంలో నేను ఏం చెప్పానో అవన్నీ వాస్తవాలే.. కొద్దిరోజుల క్రితం పవన్ గురించి చెప్పిన మాటల్లో కూడా వాస్తవాలే ఉన్నాయి. కావాలంటే లైవ్ డిటెక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు.
” సింగిల్ మదర్ గా ఉండటం చాలా కష్టం. నాకు పెద్దవారి సపోర్టు కూడా లేదు. నేను ఒంటరిగానే నా పిల్లలను పెంచుతున్నాను. ఇప్పుడు నా హెల్త్ కూడా సహకరించడం లేదు. త్వరలో నేను తప్పనిసరిగా రెండో పెళ్లి చేసుకుంటా. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నేను ఎక్కువగా ఆధ్యా గురించే ఆలోచిస్తున్నాను. అందుకే నా పెళ్లి విషయంలో కాస్త సమయం తీసుకుంటున్నాను. ముందు నా పిల్లల బాధ్యతను పూర్తి చేస్తాను. ఒక అబ్బాయి సొసైటీలో ఎలా ఉండాలో అకీరాకు నేర్పించాను. అదే విధంగా ఆధ్యాను పెంచుతున్నాను. ఫ్యూచర్ లో ఆధ్యా ఒకరికి భార్య అవుతుంది, మరోకరికి తల్లి అవుతుంది. కోడలిగా వేరొకరి ఇంట్ో అడుగుపెడుతుంది. మెట్టినింటి వారి గౌరవం పెంచేలా ఆధ్యాను పెంచాను.” అని రేణు తెలిపారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.