Actress Remuneration : టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఇప్పుడంతా సౌత్ హీరోయిన్ల హవా నడుస్తోంది. పాన్ ఇండియా సినిమాల్లోనూ మన కుందనపు బొమ్మలు ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతున్నారు. నటన పరంగానే కాదు కలెక్షన్ల పరంగా కూడా మన లేడీస్ తగ్గేదేలేదని నిరూపిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార నుంచి లేటెస్టె సెన్సేషన్ స్టార్ శ్రీలీల వరకు ఓ రేంజ్ లో సంపాదిస్తున్నారు. కోటిపైనే వీరి పారితోషకం ఉందంటే ఏ రేంజ్ లో సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మనవారి రెమ్యునరేషన్ కోటి దాటిందంటే అమ్మో అనేవారు. కానీ సీనుమారింది గురూ..ఇప్పుడు లక్కు తలుపుతడితే చాలు సౌత్ హీరోయిన్లపైన కోట్ల వర్షం కురుస్తోంది. మరి సౌత్ బ్యూటీల పారితోషికం ఎంత? ఏ హీరోయిన్ ఎంత తీసుకుంటోంది? ఇప్పుడు చూద్దాం.
సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్‌తో పోల్చితే హీరోయిన్లకు చాలా తక్కువనే చెప్పాలి. అయితే గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పకతప్పదు. కొన్నేళ్ల క్రితం వరకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్ అంటే చాలా పెద్ద విషయం. అందులోనూ సౌత్ హీరోయిన్స్ తో పోల్చితే నార్త ముద్దుగుమ్మలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఒక సినిమాలో నటించేంది నార్త్ హీరోయిన్లు అయిదు నుంచి పది కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నారు. అయితే సౌత్ బ్యూటీస్ విషయానికి వస్తే ఇక్కడ టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ అయిదు కోట్లకు మించడం గొప్ప విషయం.
దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల లిస్టులో నయనతార మొదటివరుసలో ఉంటుంది. నటిగా గత కొన్నేళ్లుగా నయనతార కొనసాగుతోంది. నయన్ నటించ ప్రతి లేడీ ఓరియంటెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుంది. అందుకే ఈ భామ ప్రతి సినిమాకు రూ.5 కోట్లు తగ్గకుండా పారితోషికం తీసుకుంటుందని సమాచారం. లేటెస్టుగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ తో నటించిన జవాన్ సక్సెస్ తో ఈ బ్యూటీ పారితోషికం ఇంకాస్త పెరిగినా షాక్ అవ్వాల్సిన పని లేదు.
నయనతార తర్వాత సౌత్ లో కొంత మంది హీరోయిన్లు రెండు నుంచి మూడు నాలుగు కోట్ల మధ్య లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్టోరీ, క్యారెక్టర్ బేస్ చేసుకుని వారి పారితోషికం ఉంటుంది. ఈ లిస్టులో సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ తో పాటు పలువులు ఉన్నారు.
ఇక రీసెంట్ సెన్షేషనల్ బ్యూటీ శ్రీలీల కూడా రెమ్యునరేషన్ విషయంలో దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ కోటి పారితోషకాన్ని క్రాస్ చేసింది. ప్రస్తుతం అరడజనుకు పైకా చిత్రాల్లో నటిస్తూ శ్రీలీల భారీ పారితోషికాన్ని తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటోంది. బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమాకు శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్ కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ తన క్యారెక్టర్ ను బట్టి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని ఇండ్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఇండస్ట్రీలో కోటి రూపాయల పారితోషకాన్ని క్రాస్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు మహా అయితే అయిదుగురు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో సౌత్ బ్యూటీలు కోటి కి మించిన రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. ఒక్క హిట్ చేతితో పడితే చాలు ప్రొడ్యూజర్లు ఆయా హీరోయిన్స్ ను బంగారు బాతుల్లా చూస్తున్నారు. పారితోషకాన్ని అమాంత పెంచేస్తున్నారు. అప్పట్లో ఉప్పెన తో సక్సెస్ ను అందుకున్న కృతి శెట్టికి తక్కువ సమయంలో కోటి పారితోషికాన్ని అందుకుంది. కానీ సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ బ్యూటీ కాస్త వెనుకపడింది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని హీరోయిన్స్ హిట్ కొడితే చాలు పారితోషకాన్ని అమాంత పెంచేస్తారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.