Actress Ester Noronha: ఎస్తర్ నోరోన్హా తాజా చిత్రం ‘మాయ’. ఈ సినిమాతో మనముందుకు మార్చ్ 15న రాబోతున్నారు ఎస్తర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బారోమాస్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘కయామత్ హి కయామత్’ అనే సినిమాలో అవకాశం అందుకున్నారు. ఈ రెండు సినిమాలతో హిందీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ తెలుగులో స్టార్ డైరెక్టర్ తేజ రూపొందించిన ‘1000 అబద్ధాలు’ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.
దర్శకుడు తేజ ఇండస్ట్రీకి ఒక హీరోను గానీ, హీరోయిన్ ని గానీ పరిచయం చేశారంటే తప్పకుండా మంచి పర్ఫార్మర్ అని అందరూ చెప్పుకుంటారు. అదే మాట ఎస్తర్ గురించి ‘1000 అబద్ధాలు’ సినిమా చూసి చెప్పుకున్నారు. తన టాలెంట్, అందం గుర్తించిన స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేశ్ బాబు ఆయన నిర్మాణంలో వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. సునీల్ హీరోగా నటించిన ఈ మూవీకి ఉదయ శంకర్ దర్శకుడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకుడు.
సుమారు 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ 25 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఎస్తర్ కెరీర్ ప్రారంభంలో ఇలాంటి హిట్ దక్కడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకున్నారు. దాంతో తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, కొంకొణి భాషలలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ‘భీమవరం బుల్లోడు’ సినిమా వచ్చి 10 ఏళ్ళు పూర్తైన సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు ఎస్తర్.
ఇక ‘సంస్కార్ కాలనీ’ లాంటి డిఫరెంట్ సినిమా చేసి ఇండస్ట్రీలో ఎలాంటి రోల్ అయినా ఎస్తర్ న్యాయం చేయగలదని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ‘మాయ’ అనే మరో డిఫరెంట్ సినిమాతో మనముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమా బాధ్యతను తన భుజాల మీద వేసుకొని ప్రేక్షకులకి ఈ సినిమా చేరువయ్యేలా కృషి చేస్తున్నారు ఎస్తర్.
సాధారణంగా సినిమా అయ్యాక రెండు మూడు ఈవెంట్స్ లో కనిపించే స్టార్ హీరోయిన్స్ కి భిన్నంగా ఉన్న ఎస్తర్ ..’మాయ’ మూవీ ప్రమోషన్స్ లో అందరూ కొత్త వాళ్ళే..మీరు ఆదరిస్తే సినిమా హిట్ అయి అందరికీ మరో ఛాన్స్ వస్తుందని చెప్పడం ఇండస్ట్రీలో చాలామందిని ఆలోచింపజేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అందరు ‘మాయ’ చిత్రాన్ని చూసి ఆదరించాలని..త్వరలో సక్సెస్ మీట్ లో కలుద్దాం అని చెప్పారు ఎస్తర్.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.