Actress Anandhi : సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పెళ్లి తర్వాత సినిమాలకు బై బై చెప్పేస్తారు. ఒకవేళ ఒకవేళ సినిమాల్లో నటించాల్సి వచ్చినా ఏ అక్క క్యారెక్టరో, వదిన క్యారెక్టర్లోనే కనిపిస్తారు. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోయిన్లు మాత్రం పెళ్లైన తర్వాత కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే అసభ్యకర సన్నివేశాలు..రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటూ చాలా జాగ్రత్త కెరీర్ లో ముందుకెళ్తున్నారు. అయితే హీరోయిన్ ఆనంది విషయం మాత్రం ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. పెళ్లైనా కూడా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోతోంది ఆనంది. తమిళంలో త్వరలో విడుదల కాబోతున్న మంగై సినిమాలో బోల్డ్ సీన్స్ లో కనిపించిందట ఆనంది. అయితే అది మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావడం వల్లే తాను అలా యాక్ట్ చేస్తున్నానని, అంతే కాదు తన భర్త ప్రోత్సాహంతోనే ఈ సినిమా చేస్తున్నాని లేటెస్టుగా చేసిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఆనంది తెలుగమ్మాయి. అయినప్పటికీ టాలీవుడ్ లో ఈ భామకు పెద్దగా గుర్తింపు లభించలేదు. తెలుగులో జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి, ప్రజానీకం వంటి మూవీస్ లో నటించినా ఆమె నటనకు సరైన గుర్తింపు రాలేదు. కానీ కోలీవుడ్‌లో మాత్రం సక్సెస్ఫుల్ హీరోయిన్ ఆనంది. ఈ భామ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు సంపాదించు కోలేకపోయింది. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఆనందికి మంచి క్రేజ్ ఉంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఆనంది అక్కడి ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే కో డైరెక్టర్ సోక్రటీస్ని వివాహం చేసుకుంది.
లేటెస్ట్ గా ఆనంది మంగై అనే తమిళ సినిమాలో నటిస్తుంది. దీని గురించి ఆనంది మాట్లాడుతూ..”ఈ మూవీ స్టోరీ వినగానే ఇందులో బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉండటంతో నో చెప్పాను. కానీ నా భర్త మాత్రం ఆ మూవీ చేయమని నన్ను ప్రోత్సహించారు. మంగై మంచి సందేషాత్మకచిత్రం. మున్నార్ నుంచి చెన్నై కి వెళ్తున్న అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అన్న స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఓ పెళ్లైన స్త్రీగా కాకుండా, నటిగా పాత్ర గురించి ఆలోచించమని నా భర్త చెప్పారు. అందుకే ఈ సినిమా చేశాను”అని ఆనంది తెలిపింది.
ఓ ఒంటరి స్త్రీని మగాడు ఎలాంటి కోణంలో చూస్తాడు అనే కథతో ఈ మూవీ సాగుతుందని ఆనంది మాటల్లో తెలుస్తుంది. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తెలుగు హీరోయిన్లు కోలీవుడ్ లో రాణించడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది తెలుగు అమ్మాయిలు తమిళ ఇండస్ట్రీలో తమ సత్తాను చూపుతున్నారు. అయితే తెలుగు హీరోయిన్స్ కు మాత్రం టాలీవుడ్ లో పెద్దగా ఛాన్స్ రావడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త మారుతున్నాయి. ఆనంది లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులకు కూడా మంచి అవకాశాలు వస్తే చూడాలని అనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. తెలుగులో ఆనంది పలు చిత్రాల్లో నటించినా అవి కమర్షియల్ గా హిట్ కాలేదు. అందుకే ఆనందితో సినిమా అంటే దర్శకులు, నిర్మాతలు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సరైన అవకాశం వస్తే చాలు ఆనంది తన టాలెంట్ చాటాలని ప్రయత్నిస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.