Renu Desai: టాలీవుడ్ నటి,పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకోవడంతో పాటు, తనకు తన పిల్లలకు సంబంధించిన గాసిప్స్ వినిపించిన వెంటనే వాటిని స్పందిస్తూ ఉంటుంది. తనపై నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది రేణు దేశాయ్.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈమె ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అవుతోంది. కాగా తాజాగా మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది రేణు దేశాయ్. తాజాగా రేణూ దేశాయ్ ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో తన చీర, తన బొట్టు బ్లూ కలర్‌లో ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఆ వీడియో పై నెటిజన్స్ అభిమానులు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్ రేణు దేశాయ్ పై కామెంట్ చేసింది. ఎంతో అందంగా ఉన్నారు ఆంటీ అంటూ కామెంట్ చేసింది. ఇక ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ థాంక్యూ బేబీ అని రాసుకొచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో పాటు ఆ స్క్రీన్ షాట్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఏదైనా చేసే విషయానికి వస్తే ఈమె దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తర్వాత ఆమె అభిమానులు ఇలాగే సినిమాలలో నటిస్తూ ఉండండి అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారు. పలు ఇంటర్వ్యూలలో కూడా తనకు సినిమాలపై ఆసక్తి ఉందని మంచి మంచి ఆఫర్లు వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది రేణు దేశాయ్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.