Actor Naresh : సీనియర్ నటుడు నరేష్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అలనాటి నటి దర్శకురాలు విజయనిర్మల కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలను పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను ఇప్పటికే అలరిస్తూనే ఉన్నారు. ‘పండంటి కాపురం’ సినిమా తో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘ప్రేమ సంకెళ్లు’ మూవీ తో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. నరేష్ కామిక్ సెన్స్ కి అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకే అప్పట్లో ఎన్నో కామెడీ చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు.
ఇప్పటికీ నరేష్ తెలుగు సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్లతో పాటు కామెడీ పాత్రల్లోనూ ఇమిడిపోయి నటిస్తున్నారు. ఇండస్ట్రీలో నటుడిగా ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో, నరేష్ పర్సనల్ లైఫ్ ద్వారా కూడా అంతే పాపులర్ అయ్యారు. అందుకు కారణం తన పెళ్లిళ్ల వ్యవహారమే. ముఖ్యంగా నరేష్ మూడవ భార్య తో విడాకుల, ఆ తర్వాత పవిత్రతో రిలేషన్ ఇలా రకరకాల కారణాలతో నరేష్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గా మారారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుకుమార్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో నటుడు నరేష్ మెథడ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ..” ఏదైనా మ్యానరిజం తీసుకున్నప్పుడు అది మనకి అలవాటు అయిపోతుంది. ఆ నటన చూసి కొన్ని రోజులకి ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుకే నేను అలాంటి వాటికి దూరంగా ఉంటాను. నేను డైరెక్టర్స్ యాక్టర్ ని. జంధ్యాల, బాపు లాంటి దర్శకుల నుంచి మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నాను. అందుకే పాత్రకు ఎంత కావాలో అంతవరకే నటిస్తాను. రామ్ చరణ్ హీరోగా వచ్చినవ్ రంగస్థలం సినిమాలోని ఈ చేతితోనే బువ్వ పెట్టాను పాట కోసం సుకుమార్ నన్ను రోజంతా ఏడవాలి అని చెప్పారు. అలా అనగానే ఎందుకు అని అడిగాను. పాట అలాంటిది అని చెప్పారు సుకుమార్ గారు. అయితే ఓసారి పాట వినిపించమన్నాను. సుకుమార్ ఆ పాట వినిపించారు. ఆ పాట వినగానే ఏడుపొచ్చేసింది. ఈ పాటకు గ్లిజరిన్ అవసరం లేదని చెప్పాను. ఏంటి జోకా అని అడిగితే కాదు సార్ నిజం అని చెప్పాను.”అని నరేష్ తెలిపారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.