Technology: ధరను నిర్ణయించే స్వేచ్ఛ మూవీ మేకర్స్‌దే…ఆకర్షిస్తున్న సరికొత్త స్టార్టప్ కంపెనీ

Technology: చాలా మంది ప్రజలు, సినిమాలను అత్యున్నత కళారూపంగా పరిగణిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కళ కూడా అభివృద్ధి చెందుతోంది. మెరుగైన రచన, కథ, ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కాన్సెప్ట్ ఆర్ట్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ మొదలైన అంశాలు ఇప్పటి ఆధునిక సినిమాలో వైవిధ్యతను అందిస్తున్నాయి. ఇవి లేనిదే ఇప్పటి సినిమా పూర్తి కావడం లేదు. అయితే ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం బడా నిర్మాతలే కాదు సినిమాపై అవగాహన ఉన్న వారు సినిమాలు తీస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇవి వెండితెరపై ప్రదర్శించడంలో విఫలమవుతున్నాయి. వీరి కష్టాలను తీర్చేందుకే ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి.

అయితే వీటిల్లో తమ సినిమా ప్రదర్శించేందుకు భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నయా ఫిల్మ్ మేకర్స్‌ కష్టాలను తీర్చేందుకే వారి ప్రతిభను ప్రదర్శించేందుకూ శాలిభద్ర షా, సిద్ధార్థ్ సిన్హా జైదీప్ అబిచందానీ ABC టాకీస్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. దీనిని ఒక ఓపెన్ యాక్సెస్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ గా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చలనచిత్ర నిర్మాతలు తమ చిత్రాలను ఉచితంగా లేదా ఓవర్‌హెడ్‌లతో అప్‌లోడ్ చేయడానికి, పక్షపాతం లేని రేటింగ్‌ను పొందడానికి, వారి నిబంధనల ప్రకారం వారి చిత్రాలను మానిటైజ్ చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్ అనుమతిస్తుంది. దీనికి అదనంగా, ABC టాకీస్ ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు అమ్మకాలు, హక్కుల లైసెన్సింగ్ ద్వారా డబ్బు ఆర్జించడానికి అనుమతిస్తుంది.

ABC టాకీస్ యువ, వర్ధమాన చిత్రనిర్మాతలకు ఒక ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా మారింది. మార్కెటింగ్, మానిటైజేషన్ కు సహకరిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుల ప్రకారం, స్వతంత్ర సినిమాలో అద్భుతమైన సామర్థ్యం ఉంది, కానీ వాటి విడుదలకు ఏర్పడే చిక్కులు, నిర్మాణ సమస్యల కారణంగా, వర్ధమాన చిత్రనిర్మాతలు తమ ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నారన్నది వారి వాదన . ఫిల్మ్ మార్కెట్‌ ప్లేస్ ఎకో-సిస్టమ్‌ను రూపొందించడానికి ABC టాకీస్ పని చేస్తోంది. ఇది ఫిల్మ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీలోని అన్ని వాటాదారులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ప్రస్తుతం, స్టార్టప్ పూర్తిగా ఉచిత హోస్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తోంది. ధరను నిర్ణయించే స్వేచ్ఛను మూవీ మేకర్స్‌కు అందిస్తుంది.

సినిమాని మానిటైజ్ చేయడంలో సహాయపడే వివిధ హక్కులను విక్రయించే అవకాశం కల్పిస్తోంది ఈ కంపెనీ. అదే విధంగా ఇతర OTTలకు లైసెన్స్ ఇవ్వడం ద్వారా మరింత డబ్బు ఆర్జించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించే చలనచిత్రాల కోసం మొదటి రకం అన్‌బయాస్డ్ రేటింగ్ సిస్టమ్ సేవలను అందిస్తోంది. అధిక స్థాయిలో ప్రాంతీయ కంటెంట్ కే ప్రియారిటీ ఇస్తోంది. ఇదే నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా పరిగనించింది ఈ సంస్థ.

ప్రస్తుతం కంటెంట్ సేకరణ , నెట్‌వర్క్ బిల్డింగ్‌పై దృష్టి సారిస్తోంది ABC టాకీస్. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 270కిపైగా ఫిల్మ్‌మేకర్‌లను ఆన్‌బోర్డ్ చేసింది. అదనంగా, ఫిల్మ్ టెక్ స్టార్టప్ దాని ప్లాట్‌ఫారమ్‌లో 200 లకుపైగా సినిమాలను, 10 నేషన్‌వైడ్ ఛానెల్ పార్ట్‌నర్‌ షిప్‌లను కలిగి ఉంది. 10 మంది సభ్యుల బృందంతో పని చేస్తున్న ఈ ఫిల్మ్ టెక్ స్టార్టప్‌కు రూ. 2 కోట్ల నిధుల నిబద్ధత కూడా లభించింది, అందులో రూ. 1 కోటి ఇప్పటికే స్టార్టప్‌కు పంపిణీ చేయబడింది.

ఈ స్టార్టప్ కంపెనీ దూకుడుగా విస్తరిస్తోంది. ABC టాకీస్ ను ఆఫ్రికాలో స్థాపించడానికి ఆఫ్రికన్ వ్యవస్థాపకులతో ఒక అవగాహన ఒప్పందాన్ని ఇటీవలె కుదుర్చుకుంది. ABC టాకీస్ తన వార్షికోత్సవ నెలలో దాని మొదటి ఒరిజినల్ ప్రొడక్షన్‌ను ప్రకటించే ప్రక్రియలో ఉంది. రాబోయే సంవత్సరంలో పిల్లల కంటెంట్‌ను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.