Aamani : అప్పటి సెన్సేషనల్ కామెడీ మూవీ జంబలకిడి పంబతో తెలుగు తెరకు పరిచయమైంది ఆమని. శుభలగ్నం,మిస్టర్ పెళ్లాం,శ్రీవారి ప్రియురాలు,మావి చిగురు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. చూడటానికి చామన చాయ రంగులో ఉన్నా తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో మేకర్స్ దృష్టిని ఆకర్షించి స్టార్ హీరోయిన్ అయ్యారు. ఇండస్ట్రీలో ఉన్నా దాదాపు స్టార్ హీరోలందరితో ఆమని స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమిళంలోనూ ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఫ్యామిలీ హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఆమని.
గ్లామర్ పాత్రల జోలికి వెళ్లకుండా చీరకట్టులో.. సంప్రదాయ లుక్ లో తెరముందు కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరయ్యారు.శుభలగ్నం, శుభసంకల్పం, మిస్టర్ పెళ్లాం, ఘరానా బుల్లోడు, అమ్మదొంగా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కోలీవుడ్ నిర్మాత ఖాజా మొయిద్దీన్ తో పెళ్లి తర్వాత చాలా కాలం ఆమని సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అత్తగా, అమ్మగా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే బుల్లితెరపైన పలు సీరియన్స్ చేస్తున్నారు. తాజాగా ఆమని తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భర్తతో విడిపోవడం గురించి మొదటి సారి స్పందించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన సినీ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే 1999లో తమిళ నిర్మాత ఖాజా మొయిద్దీన్‌ను పెళ్లి చేసుకున్నారు ఆమని. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన ఆమని, రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమని తన భర్త విడివిడిగా ఉంటున్నారు. దీని గురించి లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో అడగ్గా ఆమని మొదటిసారి స్పందించారు..” మాది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు కుదిర్చింది కాదు…అనుకోకుండా ఇద్దరం కలిశాం. ఒకరినొకరిని ఇష్టపడి వివాహం చేసుకున్నాం. నా భర్త ఓ సినిమా తీసి కోట్లు లాస్ అయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు. దీంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అప్పు మొత్తం తీర్చేశాడు. అయితే ఆ అప్పు తీర్చేందుకే నేను మళ్లీ సినిమాలు చేస్తున్నాననే రూమర్స్ వచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. సినిమాల మీద ఆసక్తితోనే అవకాశం రాగానే మళ్లీ తెరముందుకు వచ్చాను. మా ఇద్దరికి పెద్దగా గొడవలు లేవు, సమస్యలు లేవు. మేము సరదాగా ఉంటూనే విడి విడిగా ఉంటున్నాము. నేను సినిమా పనుల్లో బిజీ అయ్యాను. ఆయన తను బిజినెస్‌లో బిజీగా ఉన్నాడు. మూమిద్దరం ఇంకా డివోర్స్ తీసుకోలేదు. జస్ట్ వేరువేరుగా ఉంటున్నాం. నా పిల్లలు మాత్రం నాతోనే ఉంటున్నారు. ఉంటారు కూడా” అని ఆమని తెలిపారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.