aadipurush-movies-changes-70-percentage-done
Aadipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన టీజర్ గత ఏడాది రిలీజ్ చేశారు. అయితే ఆ టీజర్ ఎంతగా రీచ్ అయ్యిందో అంతే స్థాయిలో వివాదాస్పదంగా మారింది. రామాయణం కథని పూర్తిగా వక్రీకరించి ప్రెజెంట్ చేశారని. పాత్రల చిత్రణ మార్చేసారు అంటూ విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు.
ముఖ్యంగా కంటెంట్ విషయంలో క్యారెక్టర్స్ లుక్స్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టి పరిస్థితిలో పాత్రల లుక్స్ అలాగే ఉంటే సినిమా రిలీజ్ కానివ్వం అంటూ హిందుత్వ సంస్థలు హెచ్చరించాయి. అనాదిగా మన హిందుత్వ పురాణాల ప్రాకారమ రామాయణం పాత్రల చిత్రణ ఎలా ఉందో అలాగే చూపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఓం రౌత్ సినిమా రిలీజ్ వాయిదా వేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ మీద వర్క్ స్టార్ట్ చేశారు.
సినిమాలో క్యారెక్టర్స్ లుక్స్ ని కూడా కొంత వరకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. కాస్తా నేటివిటీకి దగ్గరగా ఉండే విధంగా పాత్రల చిత్రణ చేస్తున్నారని బిటౌన్ లో వినిపిస్తున్న మాట. అయితే అయితే అందరూ డిమాండ్ చేసే స్థాయిలో కాకుండా కొంత వరకు ఆధునీకరించి ఒప్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. హాలీవుడ్ ఆడియన్స్ కి కూడా మన రామాయణం కథని రీచ్ చేయాలని కొంత ఆధునీకరించి పాత్రల చిత్రణని మార్చినట్లుగా గతంలో ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
This website uses cookies.