Lord Ganesh: సెప్టెంబర్ 18వ తేదీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పండుగ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదాలు పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తుంటాము. ఇక మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసిమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాను.
అందుకే మనం కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు తులసి వాళ్లను తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పిస్తూ ఉంటాము. అయితే వినాయకుడికి కూడా తులసి మాల సమర్పించడం మంచిదేనా తులసిమాలతో పూజ చేయవచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే వినాయక చవితి రోజు తులసిమాలతో స్వామివారికి పూజలు చేయవచ్చా అనే విషయానికి వస్తే.. తులసిమాలతో వినాయకుడికి ఎప్పుడు కూడా పూజ చేయకూడదు. తులసి వినాయకుడికి శాపం పెట్టిన కారణంగానే తులసిమాలతో స్వామివారికి పూజలు చేయకూడదు.
కేవలం వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎప్పుడూ కూడా స్వామివారికి తులసి సమర్పించకూడదు ఇంకా స్వామివారికి గరికను సమర్పించడం ఎంతో శుభప్రదం. అందుకే పొరపాటున కూడా వినాయక చవితి రోజు ఎవరు కూడా విఘ్నేశ్వరుడికి తులసిమాల సమర్పించకపోవడం ఎంతో ఉత్తమం. వినాయక చవితి రోజు మాంసాహారం నీచు వంటి వాటికీ దూరంగా ఉండి శ్రద్ధలతో స్వామివారిని పూజించడం వల్ల ఆ గణపయ్య కరుణ కటాక్షాలు మనపై ఉండి ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాదిస్తాము.