Categories: Tips

Health : ఈ మొక్కలని పెంచండి… దోమలని తరిమికొట్టండి

Health: దోమల ద్వారా ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో అందరికి తెలిసిందే. ఈ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతోనే మరణిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. మన పరిసరాలలో మురుగునీరు నిల్వ ఉండటం వలన ఈ దోమల బెడద ఎక్కువ అవుతుంది. అయితే వర్షాకాలంలో ప్రతి ఇంట్లో కూడా దోమల సమస్య తలెత్తుతుంది.

పల్లెటూళ్ళలో ఈ దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అక్కడ పరిసరాల శుభ్రత లేకపోవడం ఒక కారణం అని చెప్పాలి. అలాగే సిటీలలో కూడా మురికివాడలలో ఈ దోమల సమస్య ఎక్కువ ఉంటుంది. మురికివాడలకి సమీపంలో ఉన్న మిగిలిన ప్రాంతాలకి ఈ దోమలు విస్తరిస్తాయి. వీటిని కంట్రోల్ చేయడం కోసం షాపులలో దొరికే ఆల్ అవుట్ లిక్విడ్ వంటివి ఉపయోగిస్తారు. అలాగే అప్పుడప్పుడు రసాయినాలతో పొగ పెడతారు.

వీటి కారణంగా దోమల వ్యాప్తి తగ్గినా కూడా అనవసరమైన రోగాలు పుట్టుకోస్తాయి. దోమలని చంపడానికి వాడే మందుల కారణంగా మనుషులలో శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి అనే విషయం ఇప్పటికే నిరూపణ అయ్యింది. అయితే దోమల వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి చక్కని ఉపాయాలు ఉన్నాయి. ఇంట్లో కొన్ని రకాల మొక్కలని పెంచడం వలన దోమల వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చని ఉద్యానవన నిపుణులు చెబుతున్నారు. మొక్కలలో ఉండే సహజ లక్షణాలు, దోమలని నియంత్రించడంలో తోడ్పడతాయి.

తులసి దోమల లార్వాలని కీటకాలను చంపడంలో సహాయపడుతుంది. తులసి మొక్కల నుంచి వచ్చే వాసన దోమలని నియంత్రిస్తుంది. అలాగే గుల్ మెహందీ మొక్క కూడా దోమలని కంట్రోల్ చేస్తుంది. దీనిని రోజ్మేరీ అని కూడా అంటారు. ఈ మొక్క పువ్వులు చాలా ఘాటైన వాసన దోమలని చంపేస్తుంది. అలాగే పుదీనా ఘాటైన వాసనని వెదజల్లుతుంది. ఇది కీటకాలు, దోమలను తరిమికోడుతుంది. అలాగే బంతి పువ్వు మొక్కలకి దోమలు, ఈగలు, ఇతర ఏ కీటకాలని దరికిచేరనివ్వవు.  అలాగే ఔషధాలలో వాడే లెమన్ గ్రాస్ దోమలని తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ ఐదు రకాల మొక్కలని ఇంట్లో పెంచుకుంటే మీ సమీపంలోకి దోమలు రమ్మన్నారావు.

Varalakshmi

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.