Lord Hanuman: హనుమాన్ ని హిందూ గ్రంధాలలో దైవాంశ సంభూతుడుగా అభివర్ణిస్తూ ఉంటాం. ఇక ప్రేతాత్మల శక్తి నుంచి కాపాడే పవనసుతుడుగా, అంజనీసుతుడుగా, ఆంజనేయుడుగా విభిన్న నామాలతో అతనిని స్మరించుకుంటాం. ఈ అనంత విశ్వంలో చిరంజీవిగా ఉన్న ఐదు మందిలో హనుమంతుడు ఒకరుగా ఆరాధిస్తూ ఉంటాం. బ్రతికి ఉండి భగవంతుడుగా పూజలు అందుకునే ఒక ఒక దేవుడు ఆంజనేయుడు. ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయం కచ్చితంగా ఉంటుంది. ఊరిపొలిమేరలో ఎక్కువగా ఆంజనేయుడి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆంజనేయుడు ఈ భూమండలం క్షేత్రపాలకుడుగా కూడా కీర్తించబడుతున్నారు.
ఇలా హనుమంతుడు దైవంగా ఆరాధించబడటానికి కారణం అతనిలో ఉన్న ఐదు గొప్ప లక్షణాలు. ఆ ఐదు లక్షణాలే హనుమాన్ ని సూపర్ హ్యూమన్ గా మార్చింది. కష్టకాలంలో రక్షించే శ్రీరామ రక్షకుడుగా కీర్తి పొందేలా చేసింది. ఆ ఐదు గుణాలు ఏంటి అనేది చూసుకుంటే భక్తి భావం… ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప భక్తుడు అంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు హనుమాన్. శ్రీరామబంటు అయిన హనుమాన్ అతనిపై నిత్యం భక్తిభావనతోనే ఉంటారు. పరమాత్ముడిపై అచంచలమైన భక్తిభావాన్ ఎలాంటి వారిని అయిన ఆద్యాత్మికోన్నతుడుగా మార్చుతుంది. ఇక హనుమంతుడిలో ఉండే నిస్వార్ధ సేవ సర్వకాలాలలో కూడా శ్రేష్టమైనది.
ఏమీ ఆశించకుండా కష్టంలో ఉన్నానని శరణు వేడుకుంటే సాయం చేసే గొప్ప సేవాగుణం హనుమంతుడిలో ఉంది. ఆ సేవాగుణమే శ్రీరాముడికి సాయం చేయడానికి కారణం అయ్యింది. ఇక హనుమంతుడిలో ఉండే బలం అద్వితీయం. ఆ బలంతో ఎవరినైనా జయించే శక్తి అతనికి ఉంటుంది. శారీరక బలం మానసిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. హనుమతుడు మనోశక్తి సంపన్నుడుగా మారడంతో అతని శారీరక బలం కూడా ఒక కారణం అయ్యింది. అంత బలం ఉన్న అవసరం అయినప్పుడు మాత్రమే దానిని అతను ఉపయోగించాడు. అనవసరంగా బలప్రదర్శనలు ఇచ్చి తాను బలవంతుడు అని ఎక్కడా చూపించుకునే ప్రయత్నం చేయలేదు. ఇక హనుమంతుడిలో ఉండే చురుకుదనం ఈ అనంతవిశ్వంలో ఇంకెవరికి ఉండదు.
ఎలాంటి సమయంలో అయిన చురుకుదనంతో పనులు చేసి అందరిని ఉత్సాహపరిచే స్వభావం హనుమాన్ యొక్క గొప్ప లక్షణాలలో ఒకటి. అలాగే అపార జ్ఞానం. చిన్న వయస్సులోనే సాక్షాత్తు సూర్యుడిని గురువుగా స్వీకరించి జ్ఞానాన్ని సంపాదించిన అద్వితీయ మూర్తి హనుమాన్. అంత జ్ఞానం ఉన్నా కూడా దానిని ఏ ఒక్కరిని తక్కువగా చూడలేదు. ఓ విధంగా చెప్పాలంటే జ్ఞానంలో శ్రీరాముడి కంటే హనుమంతుడు గొప్ప. కాని రామయ్య పాదాల దగ్గరే భక్తుడిగా హనుమాన్ నిత్యం ఉంటాడు. ఎంత జ్ఞానం ఉన్న కూడా దానిని అవసరం అయినపుడు ఉపయోగించాలి తప్ప గర్వ ప్రదర్శనలు చేయకూడదు. హనుమాన్ పాత్రలో ఇలా ఐదు గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ ఐదు లక్షణాలు మానవ సమాజంలో ప్రతి ఒక్కరిని ఆచరణీయమైనవి. వాటిని అలవాటు చేసుకుంటే మనల్ని మనం గొప్పగా ఆవిష్కరించుకోవచ్చు అనేది హనుమాన్ పాత్ర ద్వారా తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.