Categories: HealthLatestNews

Cinnamon Benefits : దాల్చిన చెక్కతో 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Cinnamon Benefits : క్రిస్మస్ రోజు అప్పుడే కుక్ చేసిన సినామోన్ రోల్స్‌ , ఎన్ని బహుమతులు ఉన్నా మన సాయంకాల సమయాన్ని ఉత్తమంగా మలుచుతాయి. కేక్స్, పేస్ట్రీస్ ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా కూడా ఈ రుచికరమైన రోల్స్‌ మనకు ఆనందాన్ని కలిగిస్తాయి.

దాల్చిన చెక్క అనేది ఒక సుగంధ దినుసు. దీనిని వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ఒక సూపర్ ఫుడ్ కూడా. వేల సంవత్సరాలుగా దాల్చిన చెక్క ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సుగంధ ద్రవ్యం సిన్నమోమమ్ కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క లోపలి బెరడు నుండి వస్తుంది. అప్పట్లో ఈ మసాలా దినుసు బంగారం కన్నా విలువైనదిగా ఉండేదట. ఆహ్లాదకరమైన రుచి, ఘాటు వాసన కలిగి ఉంటుంది. పురాతన కాలం నుంచి ఉపయోగించే అత్యంత ప్రసిద్ధి చెందిన మసాలా ఇది. ఇప్పుడు చాలా మంది వారు వండే వంటకాల్లో అమోఘమైన టేస్ట్‌ కోసం దాల్చిన చెక్కను వినియోగిస్తున్నారు.

రెండు టేబుల్ స్పూన్‌ ల దాల్చిన చెక్కలో 1.4 గ్రాముల ఫైబర్ కంటెట్స్ ఉంటాయి. విటమిన్ ఏ, మిటమిన్ బి, విటమిన్ కె తో పాటు ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆధునిక శాస్త్రం ప్రకారం దాల్చిన చెక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. శాస్త్రీయ పద్ధతుల్లో దాల్చిన చెక్క ద్వారా కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది:
సిన్నమాల్డిహైడ్ అనేది దాల్చిన చెక్క మెయిన్ ఆక్టివ్ కాంపొనెంట్. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. బెరడులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. సాల్మొనెల్లా వంటి కొన్ని బ్యాక్టీరియాలను నిరోధించడంతో పాటు శిలీంద్రాల వల్ల కలిగే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లను కూడా నియంత్రిస్తుంది.

2. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం :
యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధికి దోహదం చేస్తాయి. దాల్చిన చెక్కలో ఉండే కొలిన్, బీటీ కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దాల్చిన చెక్క చాలా శక్తివంతమైంది, సహజ ఆహార సంరక్షణకారిగా పని చేస్తుంది.

3 వాపును తగ్గిస్తుంది :
దాల్చిన చెక్క ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్ వాపును తగ్గిస్తుంది , బ్లడ్ ప్లేట్‌‌లెట్స్ ఒకదానితో ఒకటి కలిసిపోకుండా నిరోధిస్తుంది. అర్థరైటిస్ వంటి తీవ్రమైన నొప్పులు ఎదుర్కొనే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

4. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:
ఇన్సులిన్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, జీవక్రియను నియంత్రించడానికి ఉపయోగపడే ముఖ్యమైన హర్మోన్. ప్రతి రోజు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. తద్వారా టైప్ 2 డయాబెటీస్ దరి చేరకుండా సహాయపడుతుంది.

5 కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది :
దాల్చిన చెక్కలో సిన్నమేట్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తయారు చేసే ఎంజైమ్‌ చర్యను నియంత్రిస్తుంది. తద్వారా రక్తంలో కొవ్వు ఆమ్లాల సంఖ్య తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఉత్పత్తి అవ్వకుండా కాపాడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. రక్తపోటును తగ్గిస్తుంది :
దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల రక్తపోటును తగ్గిస్తుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. అంతే కాదు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించి గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

7: క్యాన్సర్ నుంచి రక్షణ :
దాల్చిన చెక్కలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. రక్త నాళాల్లో కణతులు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
దాల్చిన చెక్కను రోజూ తీసుకోవడం ద్వారా పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు.

8. మొటిమలు దరిచేరవు :
చర్మ ఆరోగ్యానికి దాల్చినచెక్క ఉత్తమమైంది. ఇది మొటిమలు ఏర్పడే బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. మూడు టేబుల్ స్పూన్ల తేనెను ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్ లాగా తయారు చేసిన మాస్క్ పెట్టుకుని పది నిమిషాల తరువాత కడిగితే మొటిమల సమస్య తీరుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

9. ఛర్మం మృధువుగా మారడానికి సహాయపడుతుంది :
దాల్చిన చెక్క మీ చర్మాన్ని మెరిసేలా , మృదువుగా ఉంచుతుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలో అనేక మారపులు చోటు చేసుకుంటాయి. కొల్లాజెన్ , ఎలాస్టిన్ చర్మాన్ని డల్ చేస్తుంది. మార్కెట్‌లో లభించే లోషన్స్ ఛర్మాన్ని మృధువుగా మార్చుతున్నప్పటికీ దాల్చిన చెక్క లోషన్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.

10. అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది :
దాల్చిన చెక్క న్యూరో ప్రొటెక్టివ్. ఇది మోటార్ ఫంక్షన్‌లో న్యూరాన్స్ ను ఇంప్రూవ్ చేసేందుకు సహాయపడుతుంది. బ్రెయిన్‌లో టావు అనే ప్రోటీన్ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.