Karnataka Elections: కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఓడిపోయినా స్థానాలలో 50 వరకు తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉన్నవే కావడం విశేషం. గత ఎన్నికలలో బీజేపీకి ఆదిక్యం ఇచ్చినవి కూడా ఇవే నియోజకవర్గాలు. అయితే ఇప్పుడు అక్కడే తెలుగు ఓటర్లు బీజేపీని గద్దె దించడానికి కారణం అయ్యారు. ఈ విషయం ఇప్పటికే కర్ణాటక నాయకులు కూడా గ్రహించారు. అయితే ఇప్పుడు బీజేపీ ఓటమికి మరో ప్రధాన కారణం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. అది వైసీపీతో బీజేపీ నడుపుతున్న పరోక్ష పొత్తు. నిజానికి ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది.
అయితే కేంద్ర నాయకత్వం జనసేనాని కంటే వైఎస్ జగన్ ని ఎక్కువగా విశ్వసిస్తోంది అనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ప్రచారం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పిన కూడా వైసీపీకి సపోర్ట్ గా ఉండే నాయకులు అడ్డుపడినట్లు టాక్. తెలుగు ప్రజలు ఏపీలో వైసీపీ వైపు ఉన్నారని, అది కూడా రాయలసీమలోకి సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాలు కాబట్టి కచ్చితంగా జగన్ ప్రభావం చేయగలరని భావించారంట. వైసీపీ నుంచి కూడా కర్ణాటక ఎన్నికలలో రాయలసీమ సరిహద్దు జిల్లాలలో బీజేపీకి సపోర్ట్ చేస్తామని హామీ లభించిందంట.
అలాగే కొంతమంది వైసీపీ నాయకులు సరిహద్దు జిల్లాలలో బీజేపీ కోసం ప్రచారం కూడా చేశారని టాక్. బీజేపీ జగన్ మీద నమ్మకం ఉంచి పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడం జరిగిందని టాక్. అయితే వైసీపీ ప్రచారం బీజేపీకి ఏ విధంగా కలిసిరాలేదని, పైపెచ్చు వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికలలో తెలుగు ప్రజల ప్రభావం ఉన్న జిల్లాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని టాక్. దీంతో బీజేపీ ఇప్పుడు పునరాలోచించుకొని వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపిస్తుందనే మాట వినిపిస్తోంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.