CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), quality = 85?
saliva on Sleeping: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా దిండు మొత్తం తడిసిపోతూ ఉంటుంది. అయితే చాలామంది ఇలా లాలాజలం వస్తున్నప్పటికీ అది సాధారణమే అని అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. నోటి నుంచి లాలాజలం రావడానికి పలు కారణాలు ఉంటాయి. మరి నోటి నుంచి లాలాజలం ఎందుకు వస్తుంది? ఇలా రావటం మంచిదేనా? లాలాజలం రావటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదా? ఈ విషయం పట్ల ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారనే విషయానికి వస్తే..
నిద్రపోతున్న సమయంలో మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన ముఖం, నోటి కండరాలు పూర్తిగా విశ్రాంతి స్థితికి చేరుకుంటాయి. ఆ సమయంలో ఒక పక్కకు తిరిగి పడుకున్నప్పుడు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మింగటానికి సాధ్యపడదు. తద్వారా అది నోటి నుంచి బయటకు వస్తుంది. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. జలుబు లేదా అలర్జీ వంటివి వచ్చినప్పుడు మన నాసిక రంధ్రాలు పూర్తిగా మూసుకుపోతాయి. తద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఆ సమయంలో మనం నోటితో శ్వాస తీసుకుంటాము. ఇలా నోటితో శ్వాస తీసుకున్న సమయంలో కూడా నోటి నుంచి లాలాజలం బయటకు వస్తుంది.
స్లీప్ అప్నియా సమస్య ఉన్నవారిలో, అలాగే నిద్రలో ఎక్కువగా గురక పెట్టే వారిలో నోటి నుండి లాలాజలం కారడం జరుగుతుంది. అదేవిధంగా కండరాల సమస్యలతో బాధపడే వారిలో కూడా ఈ విధమైనటువంటి సమస్య ఉంటుంది. ఇలా నోటి నుంచి లాలాజలం కారటం, నిద్రలో విపరీతమైన గురక వచ్చినప్పుడు అదేవిధంగా హఠాత్తుగా మేల్కొవడం, ఆహారం లేదా నీరు మింగడంలో ఇబ్బంది కలగడం, మాటతీరులో తేడా వచ్చినట్లు అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది. ఈ లక్షణాలు లేకుండా నోటిలో లాలాజలం కారుతున్నట్లయితే మనం పడుకునే విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.