Technology: సోషల్ మీడియా, డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కంపెనీలు తమ సేవలను విస్తృతం చేసుకోవడంతో పాటు యూజర్స్ కి మరింత చేరువ కావడం కోసం కొత్త కొత్త అప్డేట్స్ తీసుకువస్తున్నాయి. డిజిటల్ సేవ లో రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అలాగే చాలామంది ఎలాంటి సరైన ప్రూఫ్స్ లేకుండా సిమ్ కార్డులు తీసుకొని, వాటితో మోసాలకు పాల్పడుతున్నారు.
స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక మంది ది మెసెంజర్ సర్వీస్ వాట్సాప్ ను ఉపయోగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. పర్సనల్ మెసెంజర్ సర్వీస్ గా ఇది విస్తృత సేవలు అందిస్తుంది. అయితే వాట్సాప్ ద్వారా కూడా చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు. అలాగే ఈ వాట్సాప్ ను ప్రమోషన్ కోసం చాలా కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి.
అయితే వాట్సాప్ వినియోగంలో మరింత భద్రత తీసుకొచ్చే ప్రయత్నం ఆ కంపెనీ చేస్తుంది. అలాగే భారత్ లోని కొత్త ఐటీ రూల్స్ ప్రకారం ఐదు లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ కంపెనీలు ప్రతి నెల తమ వివరాలను పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ కూడా తమ ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఈ మెసేజ్ ఇంకా ప్లాట్ఫామ్ ఒక్క ఏప్రిల్ నెలలోనే 16 లక్షల 66 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది.
ఈ ఖాతాలన్నీ కూడా ఇండియన్స్ వే కావడం గమనార్హం. వాట్సాప్ లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉండేవిధంగా ఆ సంస్థ రిపోర్ట్ అనే ఆప్షన్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలా రిపోర్ట్ కొట్టిన వాట్సాప్ ఖాతాలను మెటా సంస్థ బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. వేధింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా డేటా సైంటిస్టులు, ఇంజనీర్లు, అనలిస్టులు, లా ఎన్ఫోర్స్మెంట్ నిపుణులు, డెవలప్మెంట్ నిపుణులతో కూడిన బృందాలను వాట్సాప్ మెసెంజర్ పర్యవేక్షణ కోసం నియమించినట్లు సంస్థ ప్రకటనలో వెల్లడించింది. ఇండియన్ ఐ టి యాక్ట్ ప్రకారం ఆయా ఖాతాలపై బ్యాన్ విధించినట్లు వెల్లడించారు. మెసేజింగ్ సేవల్లో తాము ఎప్పటికీ నెంబర్ వన్ గా ఉండే దిశగా తమ సేవలు మరింత విస్తృతం, ప్రజా ఆమోదయోగ్యంగా ఉండేలా పని చేస్తామని తెలిపారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.