Urine colour: సాధారణంగా మనం కొన్నిసార్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటాం మరికొన్నిసార్లు చాలా ఆరోగ్యంగా ఉంటాం అయితే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేకపోతే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నామా అనే విషయాలు మన మూత్రం రంగుబట్టే తెలిసిపోతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు అందుకే మనం ఏదైనా సమస్యతో హాస్పిటల్ కి వెళ్తే ముందుగా మూత్రపు పరీక్షలు చేయిస్తూ ఉంటారు. మన మూత్రం రంగు ద్వారా కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నామని మనమే చాలా సులభంగా గుర్తించవచ్చు.
మరి మూత్రం ఏ రంగులో ఉంటే ఎలాంటి సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయనే విషయానికి వస్తే.. మూత్రం లేత పసుపు రంగులో పారదర్శకంగా ఉంటే కనుక మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నామని అర్థం. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. అలాకాకుండా ముదురు పసుపు రంగులో కనక మూత్రం వచ్చింది అంటే అది నిర్జలీకరణానికి సంకేతం. ఇది కాకుండా మీరు కాలేయ సంబంధిత సమస్యలను కలిగి ఉండవచ్చని చెబుతుంది. కొన్నిసార్లు ఇది మందుల ప్రభావం వల్ల ఇలా రంగు మారవచ్చు.
ఇక మూత్రం ఎరుపు రంగు ప్రమాదానికి సంకేతం కావచ్చు. ఇది మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు. ఇలా ఎరుపు రంగులో ఉండి మూత్రం చేసేటప్పుడు నొప్పి కనుక లేకపోతే అది క్యాన్సర్ కి కూడా కారణం కావచ్చు. మూత్రం రంగు పారదర్శకంగా ఉంటే అది శరీరం మరింత హైడ్రేట్ గా ఉందని సంకేతం. నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ నీళ్లు ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల కిడ్నీపై ఒత్తిడి చూపిస్తుంది. మూత్రం ఆరెంజ్ కలర్ అంటే శరీరంలో విటమిన్ సి, కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని అర్థం. అంతేకాకుండా మీరు తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని అర్థం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.