Today Horoscope : మంగళవారం 04-04-2023 న 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ వారం కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురయ్య అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ పట్టుదలతో మీరు వాటిని పూర్తిచేస్తారు. ఇక ఒక వ్యవహారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో సత్ఫలితాలను సాధిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఈ రాశి వారు దుర్గ ధ్యానం చేస్తే లాభదాయకంగా ఉంటుంది.
వృషభం :
ఈ రోజు ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని కొన్ని పనులు చాలా ఆలస్యంగా చేస్తారు. ఇక కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి . అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ రాశి వారు శివుడిని ధ్యానించడం వల్ల మేలైన ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది. తమ ప్రతిభతో తోటి వారిని ఆకర్షిస్తారు. ఈ రోజు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు గురించి ముందుగానే గుర్తించుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశి వారు గురు ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కర్కాటకం :
ఈ రాశి వారు ఈరోజు ఓ శుభవార్తను వింటారు. అది వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక వారు చేసే పనుల్లో తోటి వారి సహకారం లభిస్తుంది. వారి సహకారంతోనూ చక్కటి ఫలితాలను పొందుతారు. అవసరానికి తగిన సహకారం అందుతుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా వాటిని ఆదిగమించే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు శని శ్లోకం చదవడం వల్ల మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
సింహం :
ఈ రాశి వారికి ఇది చాలా శుభ సమయం. ఏ రంగంలో ఉన్నా కూడా ఆశించిన ఫలితాలు అందుతాయి. అదృష్టం వీరి తలుపు తట్టుతుంది. బంధుమిత్రులతో ఈ రోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల మేలైన ఫలితాలు పొందవచ్చు
కన్య :
ఈ రాశి వారు ఈరోజు చాలా సమయానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అనుకొని కలహాలు ఏర్పడే అవకాశం ఉంది వీలైనంతవరకు మీ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి. తరచుగా నిర్ణయాలను మార్చుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడతాయి. దుర్గ ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
తుల :
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో కాస్తంత ఆటంకాలు ఎదురయ్య సూచనలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీకు తెలియకుండానే డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీలోనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇంటిలో వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు శివుడిని ధ్యానించడం వల్ల మేలైన ఫలితాలు పొందవచ్చు.
వృశ్చికం :
ఈ రాశి వారికి ఈ రోజు చాలా సానుకూలంగా ఉంది. శుభవార్తలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. సమయానికి అనుగుణంగా మీరు ముందుకు సాగితే విజయాలు సిద్ధిస్తాయి. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే లభిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఏ విషయంలోనూ కూడా ఏకగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వరుడిని ధ్యానించడం వల్ల మేలైన ఫలితాలను పొందవచ్చు.
ధనుస్సు :
ఈ రాశి వారు తమ బుద్ధి బలంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూసుకుంటారు. మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. ఈ రోజు మీరు ఓ శుభవార్తను వింటారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రీవారిని దర్శించుకోవడం వల్ల శుభప్రదం.
మకరం :
ఈ రాశి వారికి మిత్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త నియంత్రించుకోవాలి. వైరాగ్యాన్ని దరిచేరకుండా చూసుకోండి. ఈ రాశి వారు దుర్గాదేవిని ధ్యానించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
కుంభం :
ఈ రాశి వారికి చాలా సానుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముందుగా పట్టుదలతో మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ అనేది అత్యంత అవసరం. మనోబలంతో ముందుకు సాగాలి.లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
మీనం :
ఈ రాశి వారికి ఇది శుభకాలం. అభివృద్ధి చక్కగా కనిపిస్తోంది. కొన్ని కీలకమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తను వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శనీశ్వరుడిని జపించడం వల్ల మేలైన ఫలితాలను పొందవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.