Health Tips: మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో ధనియాలు తప్పనిసరిగా ఉంటాయి ధనియాలు వంటలలో వేయటం వల్ల వంటకు సరైన రుచి రావడమే కాకుండా మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందనే సంగతి తెలిసిందే. ఇలా ధనియాలను పొడిగా చేసుకుని వంటలలో ఉపయోగిస్తూ ఉంటాము.అయితే మనం ఈ ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయమే పరగడుపున ఆ నీటిని తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి నానబెట్టిన ధనియాల నీటిని తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..
బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రింక్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి. ధనియాల్లో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా దోహదపడుతుంది.
డయాబెటిస్ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండేవారు ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి అలాగే ఈ ధనియాల నీటిని తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింప చేయడమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా మనల్ని కాపాడుతుంది. ఇలా పరగడుపున ఒక గ్లాసు ధనియాల నీటిని తాగటం వల్ల ఈ ప్రయోజనాలు అన్నింటిని మనం సొంతం చేసుకోవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.