Health Tips: మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా వైట్ రైస్ తీసుకుంటూ ఉంటాము ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకున్న మధ్యాహ్నం భోజనంలో మాత్రం అన్నం తప్పనిసరిగా ఉంటుంది అయితే చాలామంది అన్నం నుంచి గంజి వంచకుండా అలాగే తయారు చేస్తారు. అలాగే మరికొందరు గంజి మొత్తం వంచి పడేస్తూ ఉంటారు. ఇలా గంజి వంచడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి కొంతమేర లాభదాయకమే కానీ సాధారణ వ్యక్తులకు మాత్రం ఇది మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా మనం అన్నం వండి వార్చిన గంజిలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి మనం ఇలా ఆ గంజి పడేయటం వల్ల ఎన్నో పోషక విలువలను కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. గంజిలో మనకు విటమిన్లు ఇతర పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి కనుక ఈ గంజిని వంచకుండా అలాగే తినటం వల్ల ఆ విటమిన్స్ అన్నింటిని కూడా మనం పొందవచ్చు. స్నానం చేసే నీటిలో కొంచెం గంజి కలిపి స్నానం చేస్తే రోజంతా హుషారుగా ఉంటారు.గంజిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
అలసటగా నీరసంగా నిస్సత్తువుగా ఉన్నప్పుడు గంజి తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. వాంతులు విరేచనాలతో బాధపడేవారికి గంజినిస్తే ఉపశమనం కలుగుతుంది. గంజిని ముఖానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది.అదే జుట్టుకు రాస్తే గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు రాలకుండా మృదువుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గంజిలో మన శరీరానికి కావలసిన 8 రకాల ఎమినో యాసిడ్లు ఉంటాయి. ఇలా అన్నం వంచడం వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనాలు అన్నింటిని కూడా మనం కోల్పోతాం కనుక గంజి వంచకుండా అన్నం తయారు చేసుకొని తినడం మంచిది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.