Telangana: అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒకే ఒక్క చక్కటి పేరును సూచించడం ద్వారా అక్షరాలా ఒక లక్ష రూపాయల బహుమతిని సొంతం చేసుకునే సువర్ణావకాశాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది. ప్రభుత్వాలు చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రజల నుంచి పేర్లను ఆహ్వానించడం, ఉత్తమమైన ఐడియా ఇచ్చిన వారిని భారీ నగదు బహుమతులతో సత్కరించడం పాతదే అయినా.. ఇప్పుడు తెలంగాణలో సరికొత్తగా ఈ ట్రెండ్ మొదలైంది.
గతంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ లోగో డిజైన్ చేసిన వారికి, అలాగే భారత కరెన్సీ (రూపాయి) గుర్తును ప్రతిపాదించిన వారికి లక్షల్లో బహుమతులు అందజేసి జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజధాని పేరు సవరణ, వైజాగ్ డేటా సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులకు ప్రజల నుంచి, ప్రముఖుల నుంచి ఐడియాలను సేకరించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ పరిధిలో.. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని అత్యంత ఆధునిక సదుపాయాలతో ‘క్యూర్ జోన్’ గా అభివృద్ధి చేస్తోంది. ప్రపంచస్థాయి నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఏరియాలో, సమాజంలోని పేద వర్గాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనే గొప్ప సంకల్పంతో దాదాపు లక్ష ఇళ్లను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇంతటి భారీ ప్రాజెక్టుకు, మానవీయ కోణంతో కూడిన ఈ ఆవాస ప్రాంతానికి ఒక వినూత్నమైన, అర్థవంతమైన పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ లక్ష రూపాయల కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు సూచించే పేరులో ‘క్యూర్ జోన్’ అనే ఉద్దేశం ప్రతిబింబించడంతో పాటు, తెలంగాణ సంస్కృతి, అస్తిత్వం ఉట్టిపడేలా ఉండాలి. అలాగే, అక్కడ నిర్మించబోయే లక్ష పేదల ఇళ్ల వెనుక ఉన్న ప్రభుత్వ ఆశయాన్ని ఆ పేరు చాటిచెప్పాలి. ఒక వ్యక్తి ఎన్ని పేర్లనైనా పంపవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోని tghd_insta పేజ్ ద్వారా మాత్రమే సాగుతుంది.
ఈ నెల 28వ తేదీ లోపు మీ ఐడియాలను పంపించాల్సి ఉంటుంది. ఎంపికైన ఉత్తమ పేరుకు రూ. 1,00,000 నగదు బహుమతిని అందించడమే కాకుండా, ఆ పేరును సూచించిన విజేత వివరాలను అధికారిక ప్రకటన ద్వారా ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ మనసులో మెదిలే ఆ సూపర్ ఐడియాను ఇన్‌స్టా వేదికగా పంచుకోండి.. లక్షాధికారి అవ్వండి.
Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…
Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…
Curd: వర్షాకాలంలో ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతాయి కనుక చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ…
TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు.…
Typhoid Fever: వర్షాకాలం మొదలవుగానే ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాలు మొదలైనప్పుడు దోమల బెడద కూడా…
Srivani Ticket Rules: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు…
This website uses cookies.