South Heroines : తండ్రీ కొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీరే

South Heroines : టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా చిత్ర పరిశ్రమలో హీరోల లైఫ్ టైంతో పోల్చుకుంటే హీరోయిన్లది చాలా తక్కువ అనే చెప్పాలి. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన 10 సంవత్సరాలు అంతా బాగానే ఉన్నా కొంతకాలం తర్వాత కొత్త నీరు అదే కొత్త హీరోయిన్లు వస్తే వీరు ఫేడౌట్ అయిపోతుంటారు. వారి ఇమేజ్ కూడా తగ్గిపోతుంది. చాలా అరుదుగా మాత్రమే కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగిస్తుంటారు. హీరోయిన్ గా వర్కౌట్ కాదనుకున్నవారంతా ఇక ఆ తర్వాత అక్క , చెల్లి, వదిన వంటి పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రంగుల లోకంలో ముందుకు వెళ్తుంటారు. ఇక కొంతమంది హీరోయిన్లు అటు తండ్రితో ఇటు కొడుకుతోనూ జోడీ కట్టిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయని చెప్పాలి. కొంతమంది హీరోయిన్లు ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా చలామణి అవుతూ తమ హవాను కొనసాగిస్తున్నారు. మరి తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్లు ఎవవరో ఇప్పుడు చూసేద్దాం.

south-heroines-who-acted-with-father-and-son-in-cinemas

అక్కినేని నాగేశ్వరరావు-నాగార్జున-శ్రీదేవి : అతిలోక సుందరి దివంగత అందాల నటి శ్రీదేవి భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. తన అందం ,నటనతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ గూడుకట్టుకుంది. అప్పట్లో శ్రీదేవి సీనియర్ హీరోలతోనే కాదు కుర్ర నటులతోనూ జోడీ కట్టి వెండితెరపైన ఓ మెరుపు మెరిసింది. ఎన్నో వందల చిత్రాల్లో నటించి ఈ అందాల తార అందరిని ఆకట్టుకుంది. అప్పటి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతోనూ శ్రీదేవి ఎన్నో సినిమాలలో కలిసి నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు ఎనర్జిటిక్ స్టార్ మన్మథుడు నాగార్జునతోనూ పలు సినిమాల్లో కలిసి నటించింది. నాగ్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన గోవిందా గోవిందా, ఆఖరిపోరాటం వంటి చిత్రాలు ఆల్ టైం హిట్ చిత్రాలుగా నిలిచాయి.

south-heroines-who-acted-with-father-and-son-in-cinemas

వెంకటేష్-రానా-నయనతార-అనుష్క :

లేడీ సూపర్ స్టార్ నయనతార గత 17 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తాజాగా షారుఖ్ నటించిన జవాన్ చిత్రంతో నయనతార బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి నయన్ ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ తో కలిసి “లక్ష్మీ ,తులసి” వంటి సినిమాల్లో నయనతార నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. బాబాయ్ తోనే కాదు వాళ్ల అబ్బాయి రానాతో కలిసి “కృష్ణం వందే జగద్గురుం” సినిమాలో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. మరో బ్యూటీ టాలీవుడ్ స్వీటి అనుష్క కూడా వెంకీ బాబాయ్ రానా అబ్బాయితో కలిసి పలు సినిమాల్లో నటించింది. వెంకటేష్‏తో చింతకాయల రవి సినిమాలో యాక్ట్ చేసిన అనుష్క ..రానాతో రుద్రమదేవి మూవీలో కలిసి యాక్ట్ చేసింది.

south-heroines-who-acted-with-father-and-son-in-cinemas

బాలకృష్ణ-ఎన్టీఆర్-శ్రీయ-త్రిష :

ఇక టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ బాలయ్య బాబుతో వాళ్ల అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి శ్రీయ పలు సినిమల్లో నటించింది. బాలకృష్ణతో శ్రీయ చెన్నకేశవరెడ్డి సినిమాలో కనిపించింది. ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నా అల్లుడు మూవీ చేసింది. ఇక కోలీవుడ్ బ్యూటీ త్రిష కూడా వీరిద్దరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. బాలకృష్ణతో లయన్ సినిమాలో మెరిసిన త్రిష, అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో కలిసి పనిచేసింది.

south-heroines-who-acted-with-father-and-son-in-cinemas

కాజల్-చిరంజీవి-రామ్ చరణ్ :

నార్త్ భామ అందాల చందమామ కాజల్ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె యాక్టింగ్ , అందంతో చాలా సినిమాల్లో నటించి అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 మూవీలో హీరోయిన్ గా నటించింది. అనంతరం మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి హిట్ సినిమాల్లో కలిసి పని చేసింది. ఇక బాబాయ్ అబ్బాయిల కాంబినేషన్ లో యువ కథనాయకి శృతి హాసని కలిసి పని చేసింది. శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేయగా, ఆ తర్వాత రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో కలిసి నటించింది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.