Incense sticks: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడమే కాకుండా అగరబత్తులను వెలిగిస్తూ ఉంటారు. ఇలా ఇంట్లో సువాసన భరితమైన అగరబత్తులను వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందని భావిస్తుంటారు. అలాగే ఇంట్లో పూజ చేసి అగరబత్తి వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని భావిస్తారు. ఇలా సువాసన కోసం ఇంట్లో సువాసన భరితమైన అగరబత్తిలను వెలిగించడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో తరచూ అగరబత్తిని వెలిగించడం వల్ల దాని నుంచి వెలువడే పొగ ధూమపానం చేసే వారితో సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఆ పొగను చిన్నపిల్లలు ఇతర కుటుంబ సభ్యులు పీల్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అగరబత్తిని వెలిగించడం వల్ల చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ తుమ్ములు దగ్గు వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.
అగరబత్తి తయారు చేసే క్రమంలో ఎన్నో రకాల రసాయనాలను ఉపయోగిస్తారు అంతేకాకుండా అవి సువాసనను వెదజల్లడం కోసం కలిపే ఈ రసాయనాలు ఎంతో హానికరం. ఇలా రసాయనాలతో తయారుచేసిన అగరబత్తి నుంచి వెలువడే పొగను పీల్చడం వల్ల శ్వాస కోశ సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా క్రమక్రమంగా క్యాన్సర్ కి కూడా కారణం అవుతాయి. అగరబత్తీలను వెలిగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు.. వీటిని వెలిగించక పోవడమే మంచిది. ఈ పొగ తగిలిన వెంటనే స్కిన్‌పై దురద వస్తుంది. తలనొప్పి, మతి మరుపు కూడా పెరుగుతాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.