Salaar : వేణు స్వామి జాతకాలు చెప్పడం ఆపేయ్..ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్

Salaar : ప్రభాస్ సినీ కెరీర్ లోనే ‘సలార్ సీజ్ ఫైర్’సెన్సేషనల్ హిట్ సాధించబోతోంది. ఈ మూవీకి వచ్చిన రివ్యూ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. విమర్శకులు సైతం మెస్మరైజ్ అయ్యేలా సరాల్ తో మ్యాజిక్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ సలార్ మేనియానే కనిపిస్తోంది. సినిమా అద్భుతహా అంటూ రివ్యూలు వస్తున్నాయి. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ ఆ తర్వాత నటించిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ప్రతస్తుం సలార్ కొత్త ఊపిరి పోసినట్లైంది. ‘ఉగ్రమ్’, ‘కేజీఎఫ్’ సీక్వెల్స్ తో స్టాడ్డమ్ సంపాదించురకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సినిమా అనగానే అంచనాలు చుక్కలను తాకాయి. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ‘సలార్’ఉంది. ట్విటర్ రివ్యూలో సలార్‎కు ఏకంగా నాలుగు స్టార్స్ ఇచ్చారు.

salaar-prabhas-fans-demands-venu-swami-to-stop-telling-horoscopes-2

భారీ అంచనాలతో సలార్ మూవీ ఇవాళ రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఇప్పటికే అమెరికాలోలో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అర్థరాత్రి నుంచే సలార్ షోలు పడుతున్నాయి. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‎కు పోటీగా టాలీవుడ్ సెలబ్రిటీలు సలార్ ఫస్ట్ షో చూసేందుకు ఉత్సాహాన్ని చూపారు. ఎక్స్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా సలార్ మూవీ చూశాడు. ట్విటర్ ద్వారా మూవీపై రివ్యూ ఇచ్చాడు. “ఇప్పుడే సలార్ చూసా.. బ్లాక్ బస్టర్ పక్కా..స్క్రీన్ మీద ప్రభాస్ కటౌట్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. యంగ్ రెబల్ స్టార్ అద్భుతహా. విజువల్స్ కెవ్వు కేక. సలార్ మేకర్స్‎కి అభినందనలు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన మూవీ ఇది” అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

salaar-prabhas-fans-demands-venu-swami-to-stop-telling-horoscopes-2

ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రస్తుతం తెర మీద వేణు స్వామి టాపిక్ వచ్చింది. వేణు స్వామి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఈయన ఫేమస్ అయ్యారనే చెప్పాలి. రీసెంట్ గా ఈయన ప్రభాస్ జ్యోశ్యం కూడా చెప్పాడు. ప్రభాస్ జాతకంలో దోషం ఉందని తెలిపారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ” ప్రభాస్ జాతకం చాలా విచిత్రమైన జాతకం. తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి జాతకాలు ఇద్దరికే ఉన్నాయి. ఒకరు ప్రభాస్ అయితే మరొకరు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్‌ రాశి తులారాశి. ఆయన జీవితంలో హైట్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇక భవిష్యత్తులో మొత్తం డౌన్సే ఉన్నాయి. ప్రభాస్‌తో మూవీ ప్లాన్ చేసే వారంతా ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాలి. ఆయన భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మళ్లీ చిన్న సినిమాలతో తన కెరియర్‌ని గాడిలో పెట్టుకోవాలి. ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ మొత్తం కిందికి పడిపోయినట్లు ఉంది” అని చెప్పారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా అప్సెట్ అయ్యారు. కట్ చేస్తే ఇవాళ సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఈ సినిమా చూసినవారంతా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ టైంలో వేణు స్వామి కామెంట్స్ గుర్తు చేసుకుంటూ..” అయ్యా వేణు స్వామి మొన్న వరల్డ్ కప్.. రీసెంట్ గా తెలంగాణ ఎన్నికలపై మీరు చెప్పిన జోస్యం బెడిసి కొట్టింది..ఇప్పుడు సలార్ లోనూ అదే జరిగింది. కాబట్టి దయచేసి మళ్లీ మా డార్లింగ్ జోలికి రాకు.. ప్రభాస్ అన్న గ్రాఫ్ రెట్టింపు అవ్వడం ఖాయం. గుర్తు పెట్టుకో.. కాబట్టి మాట మీద నిలబడే వారైతే మీరు జాతకాలు చెప్పడం మానేయండి” అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

2 weeks ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

2 weeks ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 weeks ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 weeks ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

2 weeks ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

2 weeks ago

This website uses cookies.