Rashmika Mandanna : రణ్‎బీర్ ని కొట్టి బాగా ఏడ్చేశాను

Rashmika Mandanna : పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రష్మిక మందన్న. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ లెవెల్‎లో పెరిగిపోయింది. అప్పటి వరకు సౌత్ సినిమాల్లోనే నటించిన రష్మిక, పుష్ప తర్వాత బాలీవుడ్‎లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. పలు సినిమాల్లో నటించినప్పటికీ తాజాగా విడుదలైన యానిమల్ మూవీ అమ్మడికి మంచి హిట్ అందించింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో బాలీవుడ్ యువ హీరో రణ్‎బీర్ కపూర్ నటించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సినిమాలో గీతాంజలి క్యారెక్టర్ కు నూటికి నూరు శాతం న్యాయం చేసింది రష్మిక. దీంతో యానిమల్ సీక్వెల్ లోనూ ఛాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో యానిమల్ షూటింగ్‌ లో తన అనుభవాల గురించి పంచుకుంది. మరీ ముఖ్యంగా యానిమల్ లోని ఓ సీన్ తనను బాగా ఏడిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

rashmika-mandanna-shares-her-shooting-experience-in-animal-movie

ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..”యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌తో యాక్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. డైరెక్టర్ సందీప్‌ రెడ్డి థింకింగ్ కెపాసిటీ చూసి షాక్ అయ్యాను. ఈ మూవీలో రణ్‌బీర్‌ భార్యగా ఆయన్ని చెంప దెబ్బ కొట్టే సీన్ నటిగా నాకొక ఛాలెంజింగ్ గా అనిపించింది. నిజం చెప్పాలంటే ఒక్క టేక్‌లోనే ఆ సన్నివేశం పూర్తి చేశాం. డైరెక్టర్ సీన్ ను వివరించి పరిస్థితిని ఫీలవ్వాలని చెప్పారు. ఆ మాటే నా మైండ్ లో ఉంది. షూట్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత యాక్షన్‌, కట్‌ మాత్రమే గుర్తుంది. మధ్యలో ఏం జరిగిందో అసలు గుర్తే లేదు. సీన్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాను. రణ్‌బీర్‌ మీద గట్టిగా అరిచేశాను. కోపంతో చెంపపై కొట్టాను. షాట్‌ ఓకే అని సందీప్ చెప్పినా నా ఎమోషన్స్ కంట్రోల్ కాలేదు. కంట్లో కన్నీళ్లు ఆగలేదు. ఆ సీన్ లో మాత్రం బాగా ఏడ్చేశాను. సీన్ పూర్తైన తర్వాత రణ్‌బీర్‌ దగ్గరకువెళ్లి..అంతా ఓకేనా అని అడిగాను. అలా యానిమల్ సినిమాలో ఆ సీన్ లో బాగా ఏడ్చేశాను అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. యానిమల్‌ సెకెండ్ పార్ట్ విషయంలో సందీప్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మొదటి భాగానికి మించి రెండో భాగం ఉండబోతోంది”.అని రష్మిక తన అనుభవాలను పంచుకుంది.

rashmika-mandanna-shares-her-shooting-experience-in-animal-movie

ఇదే ఇంటర్వ్యూలో పుష్ప2 గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రష్మిక. ” పుష్ప 2 గురించి మీరు ఉహించిన దానికంటే భారీ స్థాయిలో ఉంటుంది. పుష్ప విజయం మాలో బాధ్యతను మరింత పెంచింది. ఈమధ్యే ఒక పాట షూట్‌ చేశాము. ఇది ముగింపు లేని కథ.పుష్ప 2 విషయంలో నాపై ఎలాంటి స్ట్రెస్ లేదు. ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆగష్టు 15న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అవుతుంది. పుష్ప 2 తో పాటు శేఖర్‌ కమ్ముల, ధనుష్‌ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నా” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sri Aruna Sri

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.