Rakhi: ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజు తమ సోదరుడికి అక్క చెల్లెలు ఎక్కడున్నా వచ్చి రాఖీలు కట్టి వారిని ఆశీర్వదించడం లేదా వారితో ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే రాఖి కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అలాగే కట్టిన రాఖీని ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఎప్పుడు తీసేయాలి అనే విషయంపై చాలామందికి ఆ సందేహాలు ఉంటాయి.
ఈ సంవత్సరం, రాఖీ పండుగ ఆగస్టు 19, సోమవారం నాడు వస్తోంది. ఆరోజు పౌర్ణమి తెల్లవారుఝామున గం. 3.06ని.లకు ప్రారంభమై, రాత్రి 11.56 ని.లకు ముగుస్తుంది. రక్షబంధన్ కి అనుబంధంగా ఎప్పుడూ భద్రకాలం ఉంటుంది. ఇది శుభసమయం కాదు. అంటే ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిశాకే కట్టాలి. ఇక ఈ ఏడాది భద్రకాలం సోమవారం మధ్యాహ్నం 1.30 గం.ల వరకు ఉంటోందని ఈ సమయం తర్వాత రాఖీ కట్టడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ఇక రాఖీ కట్టిన తర్వాత చాలామంది ఒకటి రెండు రోజులు పెట్టుకుని పడేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు రాఖీని కచ్చితంగా 21 రోజులు చేతికే ఉంచుకోవాలి అన్ని రోజులు ఉంచుకొని వారు పౌర్ణమి తర్వాత వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వరకు అయినా ఉంచుకొని ఆ రోజు దానిని తీసి ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా భద్రంగా దాచుకోవాలి .వచ్చే రాఖీ పండుగ వరకు దానిని భద్రపరిచే అనంతరం దానిని ప్రవహిస్తున్న నీటిలో నిమజ్జనం చేయటం మంచిది. ఇలా రాఖీ కట్టడానికి ఎలా నియమాలను పాటిస్తామో రాఖీ విప్పడానికి కూడా ఈ నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.