Rajendra Prasad : తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోల్లో ప్రస్తుతం ఫుల్ ఫార్మ్‌లో ఉన్న హీరో రాజేంద్ర ప్రసాద్. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూనే మరోవైపు సోషల్ మెసేజ్ అందించే సినిమాల్లో మెయిన్ లీడ్ గా ఉంటూ ముందుకు వెళ్తున్నారు. సినిమా చిన్నదైనా పెద్దదైనా తన పాత్రకు న్యాయం చేస్తూ ఇప్పటికీ రాణిస్తున్నారు రాజేంద్రప్రసాద్. థియేటర్ లోనే కాదు ఓటీటీలోను తన నటనతో అలరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ మూడు సినిమాల్లో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అందులో ఒక సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటితో రొమాన్స్ చేయబోతున్నాడు. దీనితో ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ‘షష్టిపూర్తి’, ‘లగ్గం’ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు లేటెస్ట్ గా తన మూడో సినిమా లవ్@65 ను కూడా అనౌన్స్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలే ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే, రాజేంద్ర మాత్రం వరుసపెట్టి మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడీ గా అలనాటి నటి జయప్రద నటించబోతోంది. వీరిద్దరి ప్రేమ చుట్టూనే సినిమా కథంతా తిరగనుందని సమాచారం . వీరితో పాటు ఈ మూవీలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్ లు కీలక పత్రాల్లో కనిపించనున్నారు.
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్ ఎన్ ఆదిత్య లవ్@65 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మనసంతా నువ్వే, నేనున్నాను వంటి లవ్ స్టోరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లవ్@65 లోనూ లవ్ స్టోరీతో అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండడం మరో హైలెట్ . ఇప్పటికే షూటింగ్ కూడా మొదలయ్యింది. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.