Politics: రేవంత్ గారూ.. ఆ ‘ట్రంప్’ భజన మనకెందుకు?

Politics: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చాలనే రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్సాహాన్ని తప్పుపట్టలేం కానీ, ఆ ఉత్సాహం కాస్త అతిగా మారుతోందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌గా దూసుకుపోతున్న గచ్చిబౌలి పరిధిలోని అమెరికన్ కాన్సులేట్ ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాజకీయ, దౌత్య వర్గాల్లో పెను దుమారమే రేపుతోంది. జూన్ 23న జరగబోయే ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు కానీ, అసలు ఈ టైంలో ట్రంప్ భజన రేవంత్ సర్కార్‌కు అవసరమా? అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు మారుతుంటాయి, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం శాశ్వతంగా ఉండాలి. అమెరికా అంతర్గత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన, విభజన రేఖలు గీసిన నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్‌కు పేరుంది. కేవలం డెమొక్రాట్లు మాత్రమే కాదు, ఆయన సొంత రిపబ్లికన్ పార్టీలోనే ఒక వర్గం, మెజారిటీ అమెరికన్ పౌరులు ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ ప్రపంచాన్ని తిప్పలు పెట్టిన ఒక నాయకుడి పేరును, అది కూడా దౌత్య కార్యాలయం ఉన్న రోడ్డుకు పెట్టడం ద్వారా రేవంత్ సర్కార్ అమెరికాలోని ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే నెగెటివ్ సిగ్నల్స్ పంపినట్లవుతోంది.

politics-mr-revanth-why-do-we-need-that-trump-sycophancy

 

Politics: రేవంత్ సర్కార్ ఈ రూట్ ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది

హైదరాబాద్ నేడు కాస్ట్‌కో, ఎలి లిల్లీ, మెక్‌డొనాల్డ్స్ వంటి ఫార్చ్యూన్ 500 అమెరికన్ దిగ్గజ సంస్థలకు అడ్డాగా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి, అమెరికా అధికార యంత్రాంగాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ సర్కార్ ఈ రూట్ ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, వ్యాపారాలను ఆకర్షించడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల పేర్లు వాడితే ఒక అర్థం ఉంది కానీ, అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఒక రాజకీయ నేత పేరును శాశ్వతం చేయాలని చూడడం ఎంతవరకు సమంజసం?

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు (జూలై 4) ముందే ఈ నామకరణాన్ని అధికారికం చేసి పెద్ద స్కెచ్చే వేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ, ఈ నిర్ణయాన్ని పక్షపాత రహితంగా ఉండే సగటు అమెరికన్లు గానీ, అక్కడి ప్రస్తుత అధికార యంత్రాంగం గానీ పూర్తిగా స్వాగతించే అవకాశం లేదు. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా రాజకీయ పరిణామాలు మారి, ట్రంప్ వ్యతిరేక వర్గం అధికారంలోకి వస్తే, ఈ ట్రంప్ అవెన్యూ బోర్డు చూసి వారు ఎలా స్పందిస్తారనే కనీస ఆలోచన రేవంత్ సర్కార్ చేయకపోవడం గమనార్హం.

ఏదేమైనా పెట్టుబడుల కోసం, బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ, ఒక వివాదాస్పద విదేశీ నేత వ్యక్తిగత బ్రాండ్‌ను మోయడానికి హైదరాబాద్ ఐకానిక్ రోడ్లను వాడుకోవడం ఖచ్చితంగా వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ట్రంప్ భజన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటేనే హైదరాబాద్ అంతర్జాతీయ ప్రతిష్టకు మంచిది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.