CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), quality = 82?
Dengue Fever: సాధారణంగా వర్షాకాలం మొదలయ్యి మన ఇంటి చుట్టూ నీటి నిల్వలు కనుక ఉంటే దోమల వ్యాప్తి అధికమవుతుంది. అయితే వర్షాకాలం మొదలైన తర్వాత డెంగ్యూ దోమల వ్యాప్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే ఇంకా వర్షాకాలం మొదలవకుండానే పెద్ద ఎత్తున డెంగ్యూ వ్యాప్తి చెందడం అందరిని ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా వేసవిలో డెంగ్యూ రావడం అనేది సాధారణం. ప్రస్తుతం వేసవి కాలంలో కూడా డెంగ్యూ వ్యాప్తి అధికమవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాలు, పెరుగుతున్న తేమ కారణంగా డెంగ్యూ విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవి కాలంలో వచ్చే తీవ్రమైన జ్వరం, శరీర నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎండలు తీవ్రరూపం దాల్చిన తర్వాత అకస్మాత్తుగా వర్షాలు కురవడం, ఆ తర్వాత తేమ పెరగడం వంటి పరిస్థితులు దోమల పెరుగుదలకు అనుకూలంగా మారడంతో డెంగ్యూ వ్యాధి కూడా అధికమవుతుంది. డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే మన ఇంటి పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే నీరు నిలవకుండా జాగ్రత్త పడటం ఎంతో మంచిది.
ఇక డెంగ్యూ జ్వరం వచ్చినప్పటికీ తీవ్రతరం కాకుండా ఉండాలి అంటే ముందుగానే ఈ లక్షణాలను మన శరీరంలో గుర్తిస్తే డెంగ్యూ జ్వరం తీవ్రతరం కాకుండా ఆపొచ్చు. ఒక వ్యక్తికి తీవ్రమైన జ్వరం వారానికి మించి వస్తుంది అంటే అప్రమత్తం కావాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. జ్వరం తగ్గే సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, సరైన ఆహారం తీసుకోలేకపోవడం, అసౌకర్యంగా అనిపించడం రక్తనాళాల నుంచి ద్రవం ఉత్పత్తి కావటం, చిగుళ్ళు, ముక్కు నుంచి రక్తస్రావం, చర్మంపై గాయాలు నల్లగా మారి మచ్చలుగా ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్టయితే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. వేసవికాలంలో వచ్చే జ్వరం సాధారణ జ్వరం అని భావించి నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే పై లక్షణాలు కనుక మీలో కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో మంచిది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.