Peddi Movie: ` పెద్ది` రెమ్యున‌రేష‌న్స్‌.. ఎవరికి ఎంతిచ్చారో తెలుసా?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ఒకెత్తయితే, ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు, నటీనటుల పారితోషికాల గురించిన చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు రూ. 250 కోట్ల నుండి రూ. 300 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ భారీ బడ్జెట్‌లో సింహభాగం కేవలం రెమ్యూనరేషన్లకే ఖర్చయిందనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

peddi-movie-peddi-remunerations-do-you-know-who-got-paid-how-much

Peddi Movie: ‘పెద్ది’ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు పారితోషికం

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, ఈ ‘పెద్ది’ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. చరణ్ స్టార్‌డమ్‌కు ఈ రేంజ్ అమౌంట్ రీజనబుల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో డెబ్యూట్ ఇచ్చి, రెండో సినిమాకే మెగా హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన బుచ్చిబాబు సానకు కూడా నిర్మాతలు భారీగానే సమర్పించుకున్నట్లు టాక్. ఈ సినిమా స్క్రిప్ట్, టేకింగ్‌కు గాను ఆయనకు సుమారు రూ. 30 కోట్ల వరకు ముట్టినట్లు సమాచారం.

సినిమాకు మరింత గ్లామర్, బజ్ తీసుకురావడంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఇతర ముఖ్య నటీనటుల పారితోషికాల కోసమే మేకర్స్ దాదాపు రూ. 35 నుండి రూ. 40 కోట్ల వరకు వెచ్చించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్ న‌డుస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.