Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కువగా ఆయన ప్రజల సమస్యల మీద దృష్టి సారించి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పనుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇన్నాళ్ళు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవైపు దర్శకనిర్మాతలు మరోవైపు ఆయన అభిమానులు సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిర్మాతల ఇబ్బందులను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వీలైంత త్వరగా ఆయన నటిస్తున్న సినిమాలను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చేశారు.
ఇప్పటికే, హరిహర వీరమల్లు చిత్రానికి సంబందించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలో ఓ.జీ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓ.జీ కూడా కొద్దిపాటి చిత్రీకరణతో పూర్తి కానుంది. ఇది పూర్తైతే దీనికి సంబందించిన అప్‌డేట్స్ కూడా వరుసగా రాబోతున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక గబ్బర్‌సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉసాద్ భగత్‌సింగ్ సినిమాకి మాత్రం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ గనక కాస్త సర్దుబాటు చేసుకొని డేట్స్ ఎక్కువగా కేటాయిస్తే చిత్రీకరణ మొత్తం ఈ ఏడాదే పూర్తి కావచ్చు. ఇప్పటికే, కొంతభాగం చిత్రీకరణ కూడా జరిపారు. ఈ నిర్మాతలకి పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి చేస్తానని మాటిచ్చారు. కాబట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్‌కి సంబందించిన టాకీపార్ట్, సాంగ్స్ పూర్తైతే వరుసగా రిలీజ్ ప్లాన్సే ఉంటాయి. ఫ్యాన్స్ చేసుకోవడాని సంబరాలే సంబరాలు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.