Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లియర్ కట్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో తనదైన పంథాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ బలం తగ్గించే ప్రయత్నంలో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రలకి తెరతీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఓ వైపు టీడీపీ పొత్తు అంటూనే మరో వైపు జనసేనలో వెళ్లాలని అనుకుంటున్నా వారిని టీడీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తమ అనుకూల మీడియా ద్వారా జనసేనపైన విషప్రచారం చేయిస్తున్నారు. బీఆర్ఎస్ తో జనసేన పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అవుతుంది అంటూ. కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ కి ఆఫర్ చేసారు అని ఒక ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు.

అయితే దీనిని జనసేన నాయకులు బలంగా తిప్పికొట్టారు. అయితే  ఈ ప్రచారంతో టీడీపీకి ఇబ్బంది అవుతుందని గ్రహించి మరల సరిద్దిద్దుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జనసేన తమతో పొత్తు పెట్టుకోకుంటే భవిష్యత్తు ఉండదు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అయిపొయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇన్ని ప్రచారాల మధ్య పవన్ కళ్యాణ్ కాపు సంఘాలతో జరిగిన సమావేశంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేన కార్యకర్తల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం అస్సలు చేయనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

 

అలాగే అధికారాన్ని పంచుకోవాల్సిందే అన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో 20 సీట్లు ఇచ్చారు అనే ప్రచారం అంతా అబద్ధం అని, తాను ఏం చేసిన జనసేన కార్యకర్తలు అందరికి చెప్పి చేస్తానని చెప్పారు. అలాగే తమ బలం ఏంటో తెలుసుకొని కచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిందే అనే విధంగా టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు. దీని ద్వారా టీడీపీకి అధికారంలోకి రావడానికి జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వడం ఒక్కటే ముందున్న ఛాన్స్ అని తేల్చేశారు. మొత్తానికి ఒక్క మీటింగ్ లో అటు కాపుపని పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడంతో పాటు టీడీపీ కి కూడా క్లియర్ కట్ గా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

Varalakshmi

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.