Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రతిపక్షాలు పదే పదే ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేస్తారు. అయితే ఆ విమర్శలు నిజం కాదనే విషయం అందరికి తెలుసు. ప్యాకేజీ తీసుకొని పార్టీ నడిపేవాడు అయితే ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా షూటింగ్ లు చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఏం ఉంటుంది అనేది అందరి మాట. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తగ్గించడానికి విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంది కేవలం పార్టీని నడిపించడం కోసం. అలాగే ప్రజలకి సాయం చేయడం కోసం మాత్రమే అనే విషయాన్ని జనసైనికులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతమ్ సినిమా రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశాడు.
ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ 25 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు సాయంత్రమే జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ కోసం కోటిరూపాయిలు విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని అధికారికంగా ఫోటోలతో ధ్రువీకరించారు. ఈ ఫోటోలని జనసేన నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అటు సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఆ వచ్చే రెమ్యునరేషన్ అడ్వాన్స్ లో కోటి రూపాయిలు పార్టీ సభ్యత్వ నమోదు కోసం విరాళంగా ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ కి పార్టీ మీద, కార్యకర్తల మీద ఉన్న నిబద్దత. దీనిని చూసిన తర్వాత కూడా ఎవరైనా ప్యాకేజీ స్టార్ అన్నారంటే అది వాళ్ళ ఖర్మ అంటూ పోస్టులు చేస్తున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.