Papaya: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణంలోబొప్పాయి చెట్టు కనబడుతుంది ఇలా బొప్పాయి చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అయితే దీనిని ఇష్టంగా తినడం మాత్రమే అందరికీ తెలుసు కానీ ఇందులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కనుక బొప్పాయి అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారని చెప్పాలి. ఇంటి ఆవరణంలో లభించే బొప్పాయి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా పచ్చి బొప్పాయి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
బొప్పాయి లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ,బి,సి,ఈ, కాల్షియం,జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఆంటీ యాక్సిడెంట్ , ఫైబర్ ఇలా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి కనుక బొప్పాయి తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి బొప్పాయి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అయితే పచ్చి బొప్పాయిని డైరెక్ట్ గా కాకుండా చాలా మంది కూర తయారు చేసుకుని తింటూ ఉంటారు అయితే పచ్చి బొప్పాయిని తినడం వల్ల మన శరీరానికి ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని వస్తే…
పచ్చి బొప్పాయి తినడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైటో న్యూట్రిఎంట్స్ కొత్త కణాలను పెరిగేలా చేస్తాయి. జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తుంది. పచ్చి బొప్పాయి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ గ్యాస్ట్రిక్ట్ సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన ఎంజైములు శరీరంలోని పేగు కదలికలకు దోహదపడటమే కాకుండా మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారికీ పచ్చి బొప్పాయి జ్యూస్ కానీ లేదంటే బొప్పాయి ఆకుల జ్యూస్ కానీ ఇస్తే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరిగి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.అయితే గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి తినడం వల్ల కొందరిలో గర్భస్రావం జరిగే సూచనలు కనపడతాయి కనుక గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి తినకుండా ఉండడమే మంచిది. అయితే బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.