Categories: LatestMost ReadNews

Technology: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో సరికొత్త అధ్యాయం.

Technology: ఆ దేశ ఎన్నికలలో హ్యూమన్ మైండ్ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త విజ్ఞాన ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. మానవ మేధస్సు తన స్వప్రయోజనాల కోసం కృతిమ మేధస్సుని సృష్టిస్తుంది. ఈ కృత్రిమ మేధస్సుని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పటికే సాంకేతిక ప్రపంచంలో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలక భూమిక పోషిస్తుంది. గూగుల్ అంతర్జాల ప్రపంచం అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోనే నడుస్తుంది. అలాగే అమెజాన్, మైక్రో సాఫ్ట్, అలీబాబా, ఐబిఏం లాంటి కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకుంటున్నాయి.

ఇక మానవ సమాజంలో కూడా కృత్రిమ మేధస్సు ఒక భాగం అయిపొయింది. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద తెలియకుండానే ఆధారపడుతున్నారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. భవిష్యత్తులో మానవ ఉద్యోగాలని కూడా ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమిస్తుంది. రోజువారీ ఉద్యోగాలపై కూడా భవిష్యత్తులో ప్రభావం చూపిస్తుంది. ఐటీ కంపెనీలలో కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మనిషి ప్రమేయం లేకుండానే రోబోల కృత్రిమ మేధస్సుని ఇప్పుడు చాలా కంపెనీలు ఉపయోగించుకుంటు న్నాయి.

ఇదిలా ఉంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలో సరికొత్త అధ్యాయం మొదలైంది. డెన్మార్క్ దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక రాజకీయ పార్టీ కూడా పుట్టింది. అసలు పార్టీ అధ్యక్షుడి అవసరం లేకుండానే ఈ రాజకీయ పార్టీ పనిచేస్తుంది. మైండ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ కంప్యూటర్‌ లార్స్‌ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పార్టీని రూపొందించింది. దానికి డేనిష్ సింథటిక్ పార్టీ అని పేరు కూడా పెట్టారు. ఈ ఏడాది మే నెలలో ఈ కొత్త రాజకీయ పార్టీ అనౌన్సమెంట్ జరిగింది. డెన్మార్క్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ కృత్రిమ పార్టీ పోటీకి దిగేందుకు కూడా ఈ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఎన్నికలలో ఇప్పటి వరకు ఓటు వేయని 20 శాతం మంది ప్రజలకి ప్రత్యామ్నాయం గా ఈ పార్టీని తీసుకొచ్చినట్లు మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థ ప్రకటించింది. 1970 నుంచి పోటీ చేస్తూ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన చిన్న పార్టీల సిద్ధాంతాల ని ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా ఈ డేనిష్ సింథటిక్ పార్టీ సిద్ధం చేసి అనౌన్స్ చేసినట్లు తెలియజేశారు. మరి ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పార్టీ డెన్మార్క్ ఎన్నికలలో పోటీ చేసే అర్హతని సంపాదిస్తుందా లేదా అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఇక వేళ పోటీ చేస్తే మాత్రం అది కచ్చితంగా చరిత్ర పుస్తకాలలోకి ఎక్కుతుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.