Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతోంది వారణాసి. శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్ నారాయణ దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనుకున్నప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో అంచనాలు ఊహించని విధంగా ఏర్పడ్డాయి. జేంస్ కెమరూన్ లాంటి హాలీవుడ్ అగ్ర దర్శకుడు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారంటే రాజమౌళి సినిమాపై దేశ విదేశాలలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక, రాజమౌళి సినిమా అంటే హీరో పాత్రమే కాదు, హీరోయిన్..ఇతర ప్రధాన పాత్రలు, సన్నివేశాలు, సెట్స్..ఇలా ప్రతీ ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి వేస్తున్న సెట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు వారణాసి రూపొందుతోందంటే..అందరిలోనూ ఈ మూవీలో ఎలాంటి సెట్స్ ఉన్నాయి..ఒక్కో సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు..మహేష్ ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు!..ఇలాంటి ఆతృతతో కూడుకున్న ప్రశ్నలెన్నో ఉన్నాయి.
ఇప్పటికే, గ్లోబ్ ట్రాటర్ అంటూ వదిలిన వారణాసి టైటిల్ గ్లింప్స్ చూసిన ప్రతీ ఒక్కరికీ ఇది మరో సంచలన చిత్రం కాబోతుందని బలంగా చెప్తున్నారు. 120 దేశాలలో వారణాసి సినిమాను రిలీజ్ చేయనున్నారు. 2027, ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి నెలలో ఒకసారి ఓ క్రేజీ న్యూస్ వచ్చి అంచలంచెలుగా అంచనాలను పెంచుతోంది. అలా, తాజాగా సెట్స్ కి సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి మహేష్ వారణాసి కోసం సరికొత్త రీతిలో భారీ హంగులతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా సెట్స్ ని నిర్మిస్తున్నట్టుగా అర్థమవుతోంది.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ఆర్.మాధవన్ లాంటి దిగ్గజ నటీ నటులు వారణాసి మూవీలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ రాజమౌళి నుంచి పాన్ ఇండియా సినిమాలు బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ ల కంటే వారణాసి 10 రెట్లు ఉంటుందని ఒక్క గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో క్లారిటీ ఇచ్చారు జక్కన్న టీం. ఇప్పటి వరకూ ఓ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు, క్రేజ్ ఉంటుందో..ఇప్పుడు అలాంటి క్రేజ్ మన ఇండియన్ సినిమా మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా వారణాసి మీద ఉండటం పూర్తిగా రాజమౌళి సాధించిన క్రెడిట్ అండ్ క్రేజ్ అని చెప్పాలి. మొత్తానికి, ఇప్పుడైతే ఈ సినిమా కోసం వేసిన సెట్స్ అంతటా వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.