Latest Cinema News: బేబీ సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిన సాయి రాజేష్ సినిమాలో బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయిన అలేఖ్య హారిక నటించబోతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సంపూర్ణేష్ బాబు హీరోగా సాయి రాజేష్ హృదయ కాలేయం సినిమాను తీసి ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొబ్బరిమట్ట సినిమాను సంపూతో తీసి హాట్ టాపిక్ అయ్యాడు.
ఈ క్రమంలో షార్ట్ ఫిలింస్ లో బాగా పాపులర్ అయిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కించిన సినిమా బేబీ. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ లాంటి ప్రముఖుల నుంచి సాయి రాజేష్ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు.
ఇప్పుడు బేబీ సినిమాను నిర్మించిన మాస్ మూవీ మేకర్స్ గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ బ్యానర్ లోనే ఏకంగా నాలుగు సినిమాలను రూపొందించబోతున్నారు. అలాగే, సాయి రాజేష్ కూడా నిర్మాతగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోగా సంతోష్ శోభన్ హీరోయిన్‌గా అలేఖ్య హారిక నటించనున్నారని తాజా సమాచారం. ఎప్పటి నుంచో సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం అలేఖ్య ఎదురుచూస్తుంది. ఎట్టకేలకి సాయి రాజేష్ ఛాన్స్ ఇచ్చారట.
యూట్యూబ్ లో బాగా పాపులర్ అవడంతో బిగ్ బాస్ సీజన్ లో కంటెస్ట్ గా ఛాన్స్ అందుకుంది. ఈ షో అలేఖ్యను జనాలకి ఇంకా దగ్గర చేసింది. ఇన్స్టా లో అలేఖ్య హారిక విడియోస్ కి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు సాయి రాజేష్ నిర్మాణంలో సినిమా ఛాన్స్ అంటే ఖచ్చితంగా అలేఖ్య లైఫ్ టర్న్ తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ సినిమాతో నూతన దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. త్వరలో ఆ దర్శకుడిని మేకర్స్ పరిచయం చేయబోతున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
This website uses cookies.