Kriti Shetty : గ్లామర్ పాత్రలు చేసినా కృతిశెట్టి కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిందే..

Kriti Shetty : ఉప్పెన లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన కుర్రభామ కృతిశెట్టి. మొదటి సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా తర్వాత ఆరేడు సినిమాలకి వరుసగా సైన్ చేసి తోటి హీరోయిన్స్‌కి షాకిచ్చింది. కానీ, ఎగిసిపడిన కెరటంలా ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది అమ్మడి కెరీర్. దీనికి కారణం అనూహ్యంగా కృతిశెట్టి చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగలడమే.

Kriti Shetty’s career is now in a dilemma despite doing glamorous roles.

ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ హిట్ అయితే ఇప్పుడు కనీసం 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ బిజీగా ఉండేది. కానీ, కొత్త సినిమాల అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. పాపం మొదటి మూడు సినిమాల తర్వాత కృతి టాలీవుడ్ మీద పెట్టుకున్న ఆశలు వేరు.

కానీ, అవన్నీ గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదికూడా అక్కినేని నాగ చైతన్య సరసన చేస్తున్న సినిమా. కస్టడీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ అమ్మడి వద్దకి రాలేదు. కస్టడీ సక్సెస్ మీదే కృతిశెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా గనక రిజల్ట్ తేడా వస్తే ఇక కృతి కెరీర్ డైలమాలో పడినట్టే అంటున్నారు. తన తోటి హీరోయిన్స్ కేతిక శర్మ, నేహ శెట్టి కాస్త నెమ్మదిగా బండి లాగించేస్తున్నారు. కేతిక ఇటీవల మెగా హీరోలు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో ఛాన్స్ అందుకుంది. మరి మెగా కాంపౌండ్‌లోకి మళ్ళీ కృతిశెట్టి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Foot Health: ఇంట్లో చెప్పులు వేసుకుని నడవచ్చా? లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…

23 hours ago

Sankatahara chaturthi: సంకటహర చతుర్థి వినాయకుడికి ఇవి సమర్పిస్తే చాలు!

Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…

23 hours ago

Night Sleep: రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో…

2 days ago

Tirumala Brahmotsavam: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల ..

Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు…

2 days ago

Mushrooms: వర్షా కాలంలో ఈ పుట్టగొడుగులు తింటున్నారా? ప్రాణాలకే ప్రమాదం జర జాగ్రత్త!

Mushrooms: పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.…

4 days ago

Black Thread Significance: కాలికి నల్ల దారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారికి ప్రమాదమే?

Black Thread Significance: ఇటీవల కాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తమ చేతికి లేదా…

4 days ago

This website uses cookies.