Categories: EntertainmentLatest

Kalki Glimpse : అశ్వధ్దామగా అమితాబ్ అదుర్స్..కల్కీ గ్లింప్స్ రిలీజ్

Kalki Glimpse : సలార్ సాలిడ్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ2898AD.మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వధ్దామ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అన్నీ భాషలు వచ్చేలా ఈ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ బాలుడు అడిగిన ప్రశ్నకు ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వద్దామను అంటూ అమితాబ్ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించింది. అంతే కాదు ఈ ఒక్క వీడియోలో అమితాబ్ ను రెండు రకాలుగా చూపించాడు డైరెక్టర్.

kalki-glimpse-amitabh-bachchan-as-ashwatthama

మహానటి సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా హిట్ తో మరో అదిరిపోయే కథతో డార్లింగ్ ప్రభాస్ తో కలిసి కల్కి 2898AD సినిమా తీస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు. లోకనాయకుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, అందాల ముద్దుగుమ్మ దిశా పటాని, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కల్కీ మూవీ చివరిదశలో ఉంది . ఈసినిమాను మే 9న థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

kalki-glimpse-amitabh-bachchan-as-ashwatthama

ఇప్పటికే కల్కి నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్,టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. హిందూ మైథలాజి స్టోరీతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇక ఎప్పడెప్పుడు ట్రైలర్ వస్తుందా.. ? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కల్కి కోసం దాదాపు ఐదేళ్ళుగా కష్టపడుతున్నారు. ప్రతి సీన్ ను డీప్ గా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త వరల్డ్ ను డైరెక్టర్ సృష్టించాడని తెలుస్తోంది. ప్రేక్షకులను ఈ ప్రపంచం మెప్పిస్తుందని ఈ మధ్యనే డైరెక్టర్ కూడా ధీమాను వ్యక్తం చేశాడు.

Sri Aruna Sri

Recent Posts

Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?

Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?..అవును తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్…

7 hours ago

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

4 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

2 weeks ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

This website uses cookies.