TDP: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీ మళ్ళీ గెలవాలని ప్లాన్ చేస్తూ ఉంటే ప్రతిపక్ష టీడీపీ కూడా అధికారంలోకి రావాలని కలలు కంటూ ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు సైతం మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. ఇక మిమ్మల్ని ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వం అంటూ వైసీపీ నేతలు చాలెంజ్ చేస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా అధికార పార్టీ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష వైసీపీని అణచివేసే ప్రయత్నాలు బలంగా చేస్తుంది. అయితే దీనిని టీడీపీ కూడా అంతే బలంగా ఎదుర్కొంటుంది.
ఇదిలా ఉంటే మరో వైపు ఇప్పటికే అధికార పార్టీలో టికెట్ రాదని కన్ఫర్మ్ అయిపోతున్న నాయకులు టీడీపీ జెండా పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కోటంరెడ్డి అయితే అప్పుడే ప్రపోజల్ కూడా పెట్టారు. ఇక బీజేపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అలాగే విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. మరో వైపు దర్శి ఎమ్మెల్యే కూడా టీడీపీలో టికెట్ కోసం ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇక రాయలసీమలో కూడా కొంత మంది చంద్రబాబు, లోకేష్ తో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఇక టీడీపీ గూటికి వచ్చేవారందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించి వస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ మొదటి నుంచి ఇన్ చార్జ్ లుగా పనిచేస్తూ ఎమ్మెల్యే కావాలని ఆశాపడుతున్నవారు ఉన్నారు. వీరందరూ ఇప్పుడు వైసీపీ నేతల రాకతో ఇబ్బంది పడుతున్నారు. ఇక టీడీపీలోకి వస్తున్నవారితో ఓవర్ ఫ్లో అవుతుందనే మాట వినిపిస్తుంది. మరి దీనిని మిగిలిన పార్టీలు అనుకూలంగా మార్చుకుంటాయా? టీడీపీకి అనుకూలంగా ఉంటుందా అనేది చూడాలి.
Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…
Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…
Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో…
Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు…
Mushrooms: పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.…
Black Thread Significance: ఇటీవల కాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తమ చేతికి లేదా…
This website uses cookies.