Jayaprada : సీనియర్ నటి అరెస్టుకు స్పెషల్ టీమ్ రెడీ

Jayaprada : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జయప్రద ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైంది. యూపి ఖాకీలు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీంను రెడీ అయింది. హీరోయిన్ కం పొలిటీషియనైన జయప్రద ఏం తప్పు చేసింది?   అసలు యూపీ పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఏ నేరం కింద ఆమె అరెస్టు కాబోతోంది? ఇప్పుడు ఇదే ఈ విషయం పైన పెద్ద చర్చ జరుగుతుంది.

jayaprada-special-team-ready-to-arrest-senior-actress

రెండు తెలుగు రాష్ట్రాల్లో జయప్రద గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో అగ్రతారగా ఆమెకు ఎంతో క్రేజ్ ఉంది. తన అందంతో యాక్టింగ్ తో డాన్స్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది జయప్రద. ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కథలోని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోసే సీనియర్ నటీమణుల్లో జయప్రద కూడా ఒకరు. ఆమె తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ అనేక సినిమాల్లో  నటించి తన సత్తాను దేశవ్యాప్తంగా చాటింది.

jayaprada-special-team-ready-to-arrest-senior-actress

జయప్రదకు చిత్ర పరిశ్రమలోనే కాదు రాజకీయపరంగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సినీ కెరీర్ లో ఓ ఎత్తుకు ఎదిగిన తర్వాత జయప్రద 1994లో రాజకీయ ప్రవేశం చేసింది. తెలుగుదేశం పార్టీ తన మొదటి పార్టీ.  ఆ తర్వాత కొన్నేళ్ళకే టీడీపీ నుంచి సమాజ్ వాదీ పార్టీలో చేరింది. 2004  నుంచి పదేళ్ల వరకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి ఎంపీగా పనిచేసింది. ఆ తర్వాత 2019 నుంచి బిజెపిలో చేరింది.అయితే 2019 ఎలక్షన్స్ సందర్భంగా జయప్రద రూల్స్ అతిక్రమించారని ఆమెపై  నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేశారు. ఈ కేసులో భాగంగానే తాజాగా ఈమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ జయప్రద కోర్టుకు రాలేదు. దీంతో  సీరియస్ అయిన న్యాయవాది ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి జయప్రదను అరెస్టు చేయాలని పోలీసులకు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ క్రమంలోనే లేడీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు మెంబర్స్ తో  ఒక స్పెషల్ టీం ఏర్పాటైంది. ఈ టీమ్ జయప్రద ను వెతికి పట్టుకుని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు సమాచారం.

యూపీ  ఎలక్షన్ లలో జయప్రద రాంపూర్  నుంచి బరిలోకి దిగింది. తన ఆపొజిషన్  సమాజ్ వాదీ పార్టీ నేత  ఆజామ్ ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో జయప్రద  ఈ కేసు పైన ఎలా స్పందిస్తుందో వెయిట్ చేసి చూడాలి మరి.

Sri Aruna Sri

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.