Categories: LatestNews

ISRO : చందమామపై తల్లీ బిడ్డ ఆట..ప్రజ్ఞాస్‌ రోవర్‌ ని వర్ణించిన ఇస్రో..

ISRO : అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం హిస్టరీని క్రియేట్ చేసింది. రోదసిలో ఇప్పటివరకూ ఏ దేశం సాధించలేకపోయిన టార్గెట్ ను ఇస్రో ఇటీవలె సక్సెస్ ఫుల్ గా సాధించింది. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ కాలుమోపింది.

isro-pragyan-rover-actively-rotating-on-the-moons-surface-isro-video-viral

చంద్రుడి చెంతకు చేరిన ప్రజ్ఞాస్‌ రోవర్‌ తన పనిని మొదలు పెట్టింది. చందమామ గుట్టు విప్పేందుకు శివశక్తి పాయింట్‌లో చక చకా తిరుగుతుంది. చందమామ రహస్యాలను బయట పెట్టేందుకు తన ప్రయత్నం చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ను ISRO శాస్త్రవేత్తలకు అందిస్తోంది. చందమామపై ఉన్న వనరుల గురించిన సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు ఎప్పటికప్పుడు అందిస్తోంది రోవర్.

 

జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి పరిస్థితులపై తన రీసెర్చ్ ను కొనసాగిస్తోంది. 14 రోజుల్లో రోవర్ తన టార్గెట్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో జాబిల్లి ఉపరితలంపై అటు ఇటూ తిరుగుతూ తన అన్వేషణ కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలో ప్రజ్ఞాన్ రోవర్ చందమామపై చక్కర్లు కొడుతున్న మరో వీడియోను ఇస్రో లేటెస్ట్ గా ట్విట్టర్లో షేర్ చేసింది. తల్లి కనుసన్నల్లో బిడ్డ పెరట్లో ఆడుకుంటున్నట్లు ఉంది అంటూ ఆ వీడియోకు అదిరిపోయే క్యాప్షన్ ను జోడించింది. దీనితో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందరి అటెన్షన్ ను తన వైపు తిప్పుతోంది.

isro-pragyan-rover-actively-rotating-on-the-moons-surface-isro-video-viral

చందమామపైన ప్రజ్ఞాన్ రోవర్ సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటా చక చక తిరుగుతోంది. ప్రజ్ఞాన్‌ ఆక్టివిటీస్ ను ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా కాప్చర్ చేసింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే..చందమామ పెరట్లో బిడ్డ సరదాగా ఆడుకుంటున్నట్లుగా రోవర్ తిరుగుతున్నట్లు ఉంది కదా..అంటూ ఇస్రో రాసుకొచ్చింది. నిజానికి వీడియోలో చూస్తుంటే రోవర్ చంటిపిల్ల తిరిగినట్టే తిరుగుతోంది చందమామ పైన. మరి ఇలాంటి అద్భుతమైన మరిన్ని వీడియోలను ఇస్రో అందిస్తుందని ప్రజలు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Chandrayaan-3 Mission:
The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.

It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
Isn’t it?🙂 pic.twitter.com/w5FwFZzDMp

Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.