Krithi Shetty – Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ కృతిశెట్టి, శ్రీలీల కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఇలాంటి మార్పు ఈ బ్యూటీస్ కెరీర్‌లో జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉప్పెన సినిమాతో తెల్లుగుతెరకి పరిచయమైన కృతిశెట్టి మొదటి సినిమాతో లక్కీ హీరోయిన్‌గా పాపులారిటీని తెచ్చుకుంది. దాంతో వరుసగా 6 సినిమాలను ఒప్పుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం అంటూ వరుసబెట్టి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.
అయితే, ఉప్పెన తర్వాత కృతిశెట్టి ఒప్పుకున్న సినిమాల కథలు అంత గొప్పగా లేకపోవడంతో తిరిగి ఫ్లాపులను చూడాల్సి వచ్చింది. మంచి ఫిజిక్..ఇప్పుడున్న కుర్ర హీరోలందరికీ సూటయ్యే ఏజ్ కావడంతో దాదాపు తన వద్దకి వచ్చిన సినిమాలను కమిటైంది. అదే కృతిశెట్టి వరుస ఫ్లాపులకి కారణం అయింది. లాజికల్‌గా ఆలోచించి ఈ కథ నాకు సూటవుతుందా..హిట్ అందుకుంటానా..? అని ఆలోచిస్తే ఇప్పుడు కృతి కెరీర్ ఇంకోలా సాగేది. సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయడం వల్లే అమ్మడికి ఇప్పుడు ఆశించిన అవకాశాలు లేవు.
కానీ, శ్రీలీల అలా కాదు. మొదటి సినిమా అగ్ర దర్శకుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందD విమర్శకుల నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ దక్కించుకున్నా, ఆ తర్వాత తెలివిగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కథే ముఖ్యం అనుకున్న శ్రీలీల రవితేజ లాంటి సీనియర్ హీరో సరసన అవకాశం వస్తే రిజెక్ట్ చేయకుండా ఒప్పుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనప్పుడు మెజారిటీ భాగం ప్రేక్షకులు శ్రీలీలను కామెంట్స్ చేశారు.
కానీ, ధమాకా బ్లాక్ బస్టర్ అయ్యాక శభాష్ అన్నారు. ఇప్పుడు కూడా బాలయ్య సినిమాలో, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ఎంపికైంది. ఎంత పెద్ద బ్యానర్ అయినా కథ, అందులో తన పాత్ర బావుంటుందీ అంటేనే సైన్ చేస్తోంది. లేదంటే సున్నితంగా NO చెప్తోంది. అందుకే, స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న కృతిశెట్టి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే, అమ్మడు కష్టమే అనుకున్న శ్రీలీల మాత్రం పెద్ద సంస్థలు స్టార్ హీరోలతో సినిమాలను కమిటవుతోంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.