Health: ప్రస్తుతం ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రజలు మానసిక ప్రశాంతతకి దూరం అయిపోతున్నారు. రోజువారి జీవితాలని గడపడానికి కూడా ఇబ్బందులు పడేవారు ఉన్నారు. సమాజంలో ప్రతి మనిషిని డబ్బు శాసిస్తుంది. ఈ డబ్బు ఎంత ప్రమాదకరంగా మారిందంటే మన మానసిక స్థితిని, అన్ని అలవాట్లని సంపూర్ణంగా మార్చేస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో గ్లోబల్ వైజ్ గా ఉండే ఉద్యోగాలలో రాత్రి సమయాలలో చేసేవి కూడా ఉన్నాయి.
డబ్బు సంపాదన కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. దీంతో చాలా మంది వారి రోజువారి నిద్ర సమయాన్ని తగ్గించేసుకుంటున్నారు. కొందరైతే రకరకాల మానసిక ఒత్తిళ్ళు, డబ్బు సంపాదించాలనే ఆలోచనలు, జీవితంలో ఒడిదుడుగుల కారణంగా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. చాలా మంది నిద్రలేమి సమస్యతో సతమతం అవుతున్నారు. ఇండియాలో అయితే ఈ నిద్రలేమి సమస్య ఉన్నవారు ఇంకా ఎక్కువగా ఉన్నారని పలు అద్యయనాలలో కూడా రుజువైంది. ఒక వేళ నిద్రపోయిన ఒక పట్టాన నిద్రపట్టదు.
కనీసం గంట, రెండు గంటల వరకు నిద్రపట్టదు. ఒక వేళ పట్టిన త్వరగా మెలుకువ వచ్చేస్తుంది. ఇలా నిద్రలేమి సమస్య కారణంగా మరింత ఒత్తిడికి లోనవుతున్న వారు ఉన్నారు. రోజుకి కనీసం ఆరు గంటలు అది కూడా రాత్రి సమయాలలో నిద్రపోవాలని పరిశోధకులు చెబుతున్నారు. అలా నిద్రపోతేనే ప్రశాంతంగా రోజువారి జీవితాన్ని ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా గడపొచ్చని చెబుతున్నారు. అయితే అలా నిద్రపోని వారిలో మానసిక ఒత్తిళ్ళు మరింత ఎక్కువ అవుతున్నాయని, దాంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని చెబుతున్నారు. 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయే వారిలో గుండె సమస్యలు వేగంగా వస్తాయని పరిశోధకులు రుజువు చేసారు.
అయితే ఈ ప్రశాంతమైన నిద్రని కొన్ని చిట్కాలు ఫాలో అయితే పొందవచ్చని తెలుస్తుంది. ప్రశాంతమైన నిద్ర రావాలంటే రాత్రి సమయాలలో నిద్రపోయే సమయంలో మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే నిద్రపోయే సమయానికి మన మనస్సుని మానసికంగా సిద్ధం చేయాలి. దానికి రిమైండర్ చాలా అవసరం. అలాగే ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలా అయితే శరీరం మానసికంగా ఆ సమయానికి నిద్రపోవాలి అని డిసైడ్ అవుతుంది.
అలాగే నిద్రపోయే సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం చేయకూడదు. అలాగే నిద్రపోయే ముందు కాఫీ, టీ వంటివి అస్సలు తాగకూడదు. అలాగే నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగితే అందులో ఉండే ట్రిప్టోప్యాన్ అనే అమైనో ఆమ్లం వలన నిద్ర పడుతుంది. అలాగే నిద్రపోవడానికి ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని పాటిస్తే రాత్రివేళలో మంచి నిద్రపడుతుంది అని పరిశోధకుల మాట.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.